IVNR : సుశాంత్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా..

‘చి.ల.సౌ’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలతో ఆకట్టుకున్న యువ నటుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ట్రైలర్ ‘కింగ్’ నాగార్జున రిలీజ్ చేశారు..

IVNR : సుశాంత్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా..

Ivnr

Updated On : August 23, 2021 / 12:25 PM IST

IVNR: ‘చి.ల.సౌ’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలతో ఆకట్టుకున్న యువ నటుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్‌ లైన్.. ఎస్. దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ‘కింగ్’ నాగార్జున రిలీజ్ చేశారు.

Kartikeya : ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కార్తికేయ..!

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన IVNR ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్, టేకింగ్, డైలాగ్స్ బాగున్నాయి. లవ్, బైక్, సెంటిమెంట్, రివేంజ్ వంటి పాయింట్స్ హైలెట్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఒకప్పుడు హీరోగా అలరించిన వెంకట్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 27న థియేటర్లలోకి రాబోతుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్ : సురేష్ బాబా, భాస్కర్, సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, కెమెరా : ఎమ్. సుకుమార్, ఎడిటర్ : గ్యారీ BH, కొరియోగ్రఫీ : బృంద, రాజ్ కృష్ణ, ఫైట్స్ : రియల్ సతీష్.