Kartikeya : ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కార్తికేయ..!

కార్తికేయ గుమ్మకొండ నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది.. ఎంగేజ్‌మెంట్‌ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది..

Kartikeya : ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కార్తికేయ..!

Kartikeya Gummakonda Got Engaged

Kartikeya: టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు కంటిన్యూ అవుతున్నాయి. లాక్‌డౌన్ టైంలో ప్రొఫెషనల్ లైఫ్‌కి గ్యాప్ దొరకడంతో పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి ఎంచక్కా యంగ్ కపుల్స్ అంతా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. నిఖిల్, నితిన్, రానా, నిహారిక వంటి వారు ఓ ఇంటివారయిపోయారు. మరికొందరు నిశ్చితార్థాలు జరుపుకున్నారు.

Salaar: జగ్గూభాయ్ ఫస్ట్‌లుక్.. ఇది అరాచకమే బాసూ!

రీసెంట్‌గా మరో టాలీవుడ్ యంగ్ హీరో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ‘ఆర్ఎక్స్ 100’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ గుమ్మకొండ నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Raja Vikramarka : మెగా టైటిల్.. ‘రాజా విక్రమార్క’ గా కార్తికేయ..

కార్తికేయ ఎంగేజ్‌మెంట్‌ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. హీరోగా అలరిస్తూనే.. నాని ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ క్యారెక్టర్ చేసిన కార్తికేయ.. తమిళ స్టార్ అజిత్ ‘వలిమై’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలోనూ తను నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.