Raja Vikramarka : మెగా టైటిల్.. ‘రాజా విక్రమార్క’ గా కార్తికేయ..

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై, ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్న సినిమాకు ‘రాజావిక్రమార్క’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు..

Raja Vikramarka : మెగా టైటిల్.. ‘రాజా విక్రమార్క’ గా కార్తికేయ..

Kartikeya New Movie Titled As Raja Vikramarka

Raja Vikramarka: కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై, ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్న సినిమాకు ‘’రాజావిక్రమార్క’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. హీరోగా కార్తికేయ 7వ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ నుండి హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా గారికి మా కృతజ్ఞతలు. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ నటన, పాత్ర చిత్రణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కథకు, హీరోకు పర్ఫెక్ట్ టైటిల్ ‘రాజావిక్రమార్క’.. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కార్తికేయ లుక్ అందరికీ నచ్చింది. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించిన తర్వాత మిగతా భాగం పూర్తి చేసి, ఆ తర్వాత విడుదల వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.

Raja Vikramarka

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ.. ‘‘సినిమాలో కొత్తగా ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ఏజెన్సీ)లో జాయిన్ అయిన అధికారిగా హీరో కార్తికేయ కనిపిస్తారు. పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. యాక్షన్ సన్నివేశాలను స్పెషల్‌గా డిజైన్ చేశాం. అవి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు తాన్యా రవిచంద్రన్‌ను ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేస్తున్నాం. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయి. యువ సంగీత దర్శకుడు ప్రశాంత్. ఆర్. విహారి మంచి బాణీలు అందించారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా… సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్,
జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: పులగం చిన్నారాయణ, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్. ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు, నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.