Allu Arjun: ‘సౌత్ కా సుల్తాన్’గా ఐకాన్ స్టార్.. సౌత్ ఇండస్ట్రీలో తొలి హీరో!

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో భారీలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఖాతా ఏదైనా..

Allu Arjun: ‘సౌత్ కా సుల్తాన్’గా ఐకాన్ స్టార్.. సౌత్ ఇండస్ట్రీలో తొలి హీరో!

Allu Arjun

Updated On : August 31, 2021 / 7:30 AM IST

Allu Arjun: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో భారీలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఖాతా ఏదైనా రికార్డులు బన్నీ సొంతం. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయర్స్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్ అంటే సామాన్య విషయం కాదు. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో కూడా ఈ స్టైలిష్ స్టార్ కాగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగేళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకోవడం విశేషం.

ఇన్‌స్టాలోకి వచ్చిన దగ్గర నుండి ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి, అంతకు మించి ఫ్యామిలీ గురించి అభిమానులతో పంచుకొనే బన్నీ అప్పుడప్పుడు సర్ప్రైజ్ లు కూడా ఇస్తుంటాడు. ఇన్ స్టాలో మొదటి నుండి ఇతర హీరోలకు అందని రీతిలోనే ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వచ్చిన బన్నీ ఇప్పుడు ఏకంగా 13 మిలియన్ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు తన అభిమానులు అల్లు అర్జున్‌ను ‘సౌత్ కా సుల్తాన్’ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే పేరుతో వైరల్ చేస్తున్నారు.

ఇన్ స్టాలో తనను అగ్ర హీరోను చేసిన 13 మిలియన్ ఫాలోవర్స్ కు అల్లు అర్జున్ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇక, ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇక, బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.