Manamey : శర్వానంద్ ‘మనమే’ సినిమా నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది..
శర్వానంద్, కృతిశెట్టి నటిస్తున్న 'మనమే' సినిమా నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. ఇక నా మాటే..

Ika Na Maate lyrical song released from Sharwanand KrithiShetty Manamey movie
Manamey : శర్వానంద్ చాలా గ్యాప్ తరువాత ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శర్వా 35వ సినిమాగా రాబోతుంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్.. ఈ మూవీ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసారు.
ఈ సినిమా నుంచి ‘ఇక నా మాటే’ అంటూ సాగే పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మెలోడీ మెజీషియన్ హేశం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ చేసిన మెలోడీని కూడా వినేయండి.
Also read : Family Star Trailer : ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది.. నేను అలాంటి మగాడిని కాదండి బాబు..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఒక చిన్న పాపని చూపించారు. ఇక ఇది చూసిన తరువాత ఈ సినిమా కథ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఉండబోతుందా..? అనే సందేహం కలుగుతుంది. మరి శ్రీరామ్ ఆదిత్య ఎలాంటి కథతో వస్తున్నారో చూడాలి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.