రిలేషన్‌కి ప్యాకప్ చెప్పేశారు!

ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో రిలేషన్ కట్ చేసుకుంది.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఉన్న ఆండ్రూ ఫోటోలన్నీ డిలీట్ చేసేసింది..

  • Published By: sekhar ,Published On : August 26, 2019 / 10:54 AM IST
రిలేషన్‌కి ప్యాకప్ చెప్పేశారు!

Updated On : May 28, 2020 / 3:43 PM IST

ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో రిలేషన్ కట్ చేసుకుంది.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఉన్న ఆండ్రూ ఫోటోలన్నీ డిలీట్ చేసేసింది..

ఒక్క నడుమూపుతో కుర్ర కారుకి నిద్రలేకుండా చేసి.. అతి తక్కువ టైములోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది గోవా బ్యూటీ ఇలియానా.. గతకొద్ది కాలంగా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం చేస్తూ సినిమాలకు దూరమైంది. అడపా‌దడపా బాలీవుడ్‌లో సినిమాలు చేసినా.. ప్రియుడితోనే ఎక్కువ సమయం గడిపేది. ఆండ్రూ తన కెమెరా కన్నుతో ఇలియానాను ఎలాంటి ఫోటోలు తీశాడో మనం చూశాం.

ఇక్కడి వరకూ బాగానే ఉంది ఇక పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అనుకుంటుండగా.. పెళ్లీ గిల్లీ జాన్తానయ్ అంటూ బ్రేకప్ అయిపోయారు. ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఉన్న ఆండ్రూ ఫోటోలన్నీ డిలీట్ చెయ్యడంతో పాటు అతగాణ్ణి అన్‌ఫాలో చేసింది. ఆండ్రూ కూడా ఇల్లీ బేబిని అన్‌ఫాలో అయ్యాడు. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్‌తో ‘మన రిలేషన్ అంతా కట్టి కబోర్డ్‌లో పడేసి ఫ్రెష్‌గా ఎవరి బతుకులు వాళ్లు బతుకుదాం’ అనే డైలాగ్ చెప్తుంది ఇలియానా..

Read Also : అల్లు అర్జున్ రేంజ్‌‌రోవర్ – బీస్ట్..

ఇప్పుడు రీల్ లైఫ్‌లో కూడా తన రిలేషన్‌ని బ్రేకప్ చేసుకోవడం సినిమా సర్కిల్స్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ప్రియుడితో విడిపోవడానికి గల కారణాలేంటో ఇలియానా చెప్పే వరకూ ఈ బ్రేకప్ గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి.