అల్లు అర్జున్ రేంజ్‌‌రోవర్ – బీస్ట్

రూ.2.33 కోట్లతో రేంజ్‌రోవర్ లగ్జరీ ఎస్‌యూవీ కొని, దానికి బీస్ట్ అని పేరు పెట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

  • Published By: sekhar ,Published On : August 26, 2019 / 10:36 AM IST
అల్లు అర్జున్ రేంజ్‌‌రోవర్ – బీస్ట్

Updated On : May 28, 2020 / 3:43 PM IST

రూ.2.33 కోట్లతో రేంజ్‌రోవర్ లగ్జరీ ఎస్‌యూవీ కొని, దానికి బీస్ట్ అని పేరు పెట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

సెలబ్రిటీలు ఆన్ స్క్రీన్ ఎలాంటి రోల్స్ చేసినా, ఆఫ్ స్క్రీన్ వారి లైఫ్ స్టైల్ చాలా లగ్జీరియస్‌గా ఉంటుంది.  వాళ్లు నివసించే ఇళ్లు, వాడే కార్లు, గాడ్జెట్స్ అన్నీ కాస్ట్లీ గానూ.. ధర వింటే సామాన్యులు అవాక్కయ్యేలానూ ఉంటాయి. ఇదంతా దేని గురించి అంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా  ఓ రేంజ్‌రోవర్ కార్ కొన్నాడు. కారుతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు..

‘మా ఇంట్లో న్యూ కార్.. దీనికి నేను బీస్ట్ అని పేరు పెట్టాను.. నేను ఎప్పుడు ఏది కొన్నా నా మైండ్‌లో ఒకటే ఉంటుంది.. అదే కృతజ్ఞత’.. అంటూ.. ‘రేంజ్‌రోవర్’, ‘ఏఏబీస్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను యాడ్ చేశాడు. బన్నీ ఇంతకు ముందు రూ. 7 కోట్లతో ఫాల్కన్ అనే వ్యానిటీ వ్యాన్ కొన్నాడు.

Read Also : రిలేషన్‌కి ప్యాకప్ చెప్పేశారు!

ఇప్పుడు రూ.2.33 కోట్లతో రేంజ్‌రోవర్ లగ్జరీ ఎస్‌యూవీ తీసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న అల… వైకుంఠపురములో… 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. తర్వాత సుకుమార్, వేణు శ్రీరామ్‌‌లతోనూ సినిమాలు చెయ్యనున్నాడు బన్నీ..