Ileana D’Cruz : ఈ బాధని ఎదుర్కోవడం చాలా కష్టం.. ఇలియానా ఎమోషనల్ పోస్ట్..

ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టింది. 'ఈ బాధని ఎదుర్కోవడం చాలా కష్టం' అంటూ..

Ileana DCruz emotional post on her instagram story about his baby

Ileana D’Cruz : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవల పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన వార్త అందరికి తెలిసిందే. ఆగస్టు 1న ఇలియానా డెలివరీ జరిగింది. తన బిడ్డ పేరుని, బాబు ఫేసుని రివీల్ చేసిన ఇలియానా.. బాబు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూనే వస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టింది. ‘ఈ బాధని ఎదుర్కోవడం చాలా కష్టం’ అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ ఇలియానా ఈ విషయం గురించి మాట్లాడుతుంది..?

తన బాబు అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది. “ఈ బాధని ఎదుర్కోవడం గురించి మనకి ఎవరు నేర్పించారు. ఇది ఎంతో కష్టంగా ఉంటుంది” ఇలియానా బాబుతో ఉన్న ఫోటో షేర్ చేస్తూ రాసుకొచ్చింది. అలాగే మరో ఫొటోలో.. “రోజంతా బాబుని ఎత్తుకొని ఉండాల్సి వస్తుంది. నాకు కూడా ఈ చిట్టి కౌగిలింతలు అవసరం” అంటూ రాసుకొచ్చింది.

Also Read : Bhagavanth Kesari : భగవంత్ కేసరి సెకండ్ సింగల్ వచ్చేసింది.. ఉడతా ఉడతా ఉష్..

కాగా ఇలియానా భర్త ఎవరు అన్నది ఇంకా ఒక ప్రశ్నగానే ఉంది. ఆ మధ్య ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసినప్పటికీ అతను ఎవరు అన్నది మాత్రం తెలియజేయలేదు. ఆ వ్యక్తినే ఇలియానా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం పై ఇలియానా ఇంకెన్నాళ్లు సైలెన్స్ మెయిన్‌టైన్ చేస్తుందో చూడాలి.

ఇక బాబు పుట్టిన తరువాత ఇలియానా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన రెండు చిత్రాలు అయితే షూటింగ్ ని పూర్తి చేసుకొని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాయి. టాలీవుడ్ మూవీ ‘దేవదాస్’తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ హోదాని అందుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా.. అడపాదడపా ఇక్కడ సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది.