Throwback Pics: పూలు పెట్టుకున్నా.. ప్యాంటు, చెప్పులు లేవు.. కవ్విస్తోందిగా..

  • Published By: cln raju ,Published On : April 16, 2020 / 06:04 PM IST
Throwback Pics: పూలు పెట్టుకున్నా.. ప్యాంటు, చెప్పులు లేవు.. కవ్విస్తోందిగా..

Updated On : April 16, 2020 / 6:04 PM IST

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. చేయాలనుకుని చేయలేనివి, ఇష్టమైనవి.. ఇలా చాలా పనులు చేస్తున్నారు. కొంతమంది కథానాయికలు మాత్రం పాత ఫోటోలనే తిరిగి పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు.
తాజాగా గోవా బ్యూటీ ఇలియానా షేర్ చేసిన బికినీ పిక్ బాగా వైరల్ అవుతోంది. ‘Throwback’ అంటూ ఇది వ‌ర‌కు త‌ను పోస్టు చేసిన ఫోటోనే మ‌ళ్లీ పోస్టు చేసింది. ఈ పిక్చర్‌లో తన జడలో పూలున్నాయని, కింద ప్యాంట్, కాళ్లకు చెప్పులు మాత్రం లేవని ఇలియానా కామెంట్ చేసింది.

హీరోయిన్, అందులోనూ అందాలారబోస్తూ పిక్ షేర్ చేస్తే పాతదైతే ఏంటి.. కొత్తదైతే ఏంటి అంటూ భారీగా లైక్‌లు కొడుతున్నారు. ఇల్లీ బేబి ఫోటో పోస్టు చేసిన తొలి రెండు గంట‌ల్లోనే ఐదు ల‌క్ష‌లకు పైగా లైక్స్ వచ్చాయి. వైట్ బికినీలో ఇలియానా ఏంజెల్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ‘Pagalpanti’ మూవీలో కనిపించిన ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ‘The Big Bull’లో నటిస్తోంది.