Mana ShankaraVaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది..?

నేడు జనవరి 12న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజవ్వగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Mana ShankaraVaraPrasad Garu)

Mana ShankaraVaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది..?

Mana ShankaraVaraPrasad Garu

Updated On : January 12, 2026 / 3:05 PM IST

Mana ShankaraVaraPrasad Garu : సంక్రాంతి పండక్కి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయగా నయనతార, క్యాథరిన్ త్రెసా, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సచిన్ ఖేద్కర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నేడు జనవరి 12న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజవ్వగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Mana ShankaraVaraPrasad Garu)

ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఫ్యాన్స్, ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇటీవల అన్ని సినిమాలు ఏ ఓటీటీలోకి రాబోతున్నాయో సినిమా స్క్రీన్ మీదే చెప్పేస్తున్నాయి. అలాగే మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్స్ ని ప్రకటించింది.

Also Read : Cheekatilo : పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్.. ‘చీకటిలో’ శోభిత ఏం చేస్తుంది..

మన శంకర వరప్రసాద్ గారు సినిమా జీ5 ఓటీటీలోకి రానుంది. జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొనుక్కుంది. ఇటీవల పెద్ద సినిమాలు కూడా 27 నుంచి 30 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. ఈ లెక్కన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా ఆ వాలెంటైన్స్ వారంలో జీ5 ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.