పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ.. ఏపీ అలా చేయడానికి వీల్లేదని చెప్పామన్న ఉత్తమ్‌

"రాజ్యాంగంలోని నిబంధన 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వెంటనే సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నాం" అని అన్నారు. 

పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ.. ఏపీ అలా చేయడానికి వీల్లేదని చెప్పామన్న ఉత్తమ్‌

Uttam Kumar Reddy (Image Credit To Original Source)

Updated On : January 12, 2026 / 2:59 PM IST
  • పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ
  • గోదావరిలో ఏపీకి 484 టీఎంసీలే కేటాయించారన్న ఉత్తమ్‌
  • ఆంధ్ర ఎక్కువ నీళ్లు తరలించేందుకు ప్రయత్నిస్తోందని కామెంట్ 

Uttam Kumar Reddy: పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు తాను ప్రత్యక్షంగా హాజరయ్యానని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

“గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌కు 484 టీఎంసీలే కేటాయించారు. కానీ, నిబంధనలను ఉల్లంఘించి ఆంధ్ర ఎక్కువ నీళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. అలా చేయటానికి వీల్లేదని అన్నారు.

Also Read: కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌

కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వినియోగించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని సుప్రీంకోర్టుకు సింఘ్వీ చెప్పారు. ప్రాజెక్టును పూర్తిగా ఆపాలని వాదనలు వినిపించారు.

ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ఉల్లంఘిస్తోందని వాదనలు వినిపించాం. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్ట్ నిర్మిస్తోందని చెప్పాం. రాజ్యాంగంలోని నిబంధన 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వెంటనే సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నాం.

ఇద్దరు ముఖ్యమంత్రుల వాదనలతో అందరం ఏకభవిస్తున్నాం. తెలంగాణ హక్కులని కాపాడుకోవడం కోసం న్యాయపరంగా పోరాడుతున్నాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల రాష్ట్ర హక్కులని కాపాడుకోవడం కోసం అన్ని స్థాయుల్లో పోరాడుతుంది. తెలంగాణ నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరాలు చెబుతోంది” అని అన్నారు.