Ileana D’Cruz : కొడుకు కోసం ఇలియానా కోరిక.. ఆ బొమ్మని పెద్ద సైజులో చేసి ఇవ్వండి..
ఇటీవల తల్లి అయిన ఇలియానా.. కొడుకు కోసం ఒక కోరిక కోరింది. ఆ బొమ్మని పెద్ద సైజులో చేసి ఇవ్వండి అంటూ..

Ileana DCruz wishes big bird toy for his baby boy
Ileana D’Cruz : గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల తల్లి అయిన సంగతి అందరికి తెలిసిందే. ఆగస్టు 1న పండంటి మగబిడ్డకి జన్మనించింది. ఇక ఆ బాబుతో తన మదర్‌హుడ్ ని ఎంజాయ్ చేస్తుంది. అమ్మగా తన పేస్ చేస్తున్న ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. ఈక్రమంలోనే ఇటీవల తన కొడుకు అనారోగ్యంతో బాధ పడుతుంటే.. అది చుసిన తన మనసు తట్టుకోలేకపోతుందంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇలియానా తాజా పోస్టు చూస్తుంటే.. బాబు ఆరోగ్యం బాగు అయినట్లు తెలుస్తుంది.
తన బాబు కోసం ఇలియానా కొత్త ఉయ్యాలా కొన్నది. ఇక ఆ ఉయ్యాలకు చిన్న చిన్న పక్షి బొమ్మలు ఉన్నాయి. అవి చూసిన బాబు పేస్ లో హ్యాపీనెస్ పొంగుకొచ్చింది. బాబు పేస్ లో ఆనందం చూసిన ఇలియానా.. ఆ ఉయ్యాల తయారు చేసే సంస్థకి ఒక రిక్వెస్ట్ పెట్టింది. చిన్నగా ఉన్న పక్షి బొమ్మని.. ‘పెద్ద సైజులో తయారు చేసి ఒకటి ఇవ్వండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. బాబు ఉయ్యాలో ఉన్న ఫోటోలను ఇలియానా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.
Also read : Varun – Lavanya : వరుణ్, లావణ్య పెళ్లి వేదిక డెకరేషన్ చూశారా..? పెళ్లి పనులన్నీ ఉపాసన..!
View this post on Instagram
ఇది ఇలా ఉంటే, ఇలియానా పెళ్లి వార్త చెప్పకుండానే తల్లి అయిన వార్త చెప్పింది. ఆమె పెళ్లి ఎప్పుడు అయ్యింది..? ఆమె భర్త ఎవరు అన్నది..? ఒక ప్రశ్నగా ఉంది. దీని గురించి ఆమెను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నా.. ఇలియానా మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య ఒక ఫారిన్ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి.. లవ్ అంటూ రాసుకొచ్చింది గాని, అతడు ఎవరు..? అతడినే పెళ్లి చేసుకుందా..? అనేది మాత్రం తెలియజేయలేదు.