ఒక్క ఫొటోతో హీట్ ఎక్కిస్తోంది.. pic inside..

Ileana D’Cruz’s Latest Workout Selfie: గోవా బ్యూటీ ఇలియానా మరోసారి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తన పరువాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో
హీట్ పెంచుతోంది. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. థియేటర్లు తెరుచుకోలేదు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నారు. నచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్ అన్నిటినీ పిక్స్, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ లాక్‌డౌన్ టైంలో ఇలియానా తన వర్కౌట్స్ ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీచ్‌లో బికినిలో దర్శనమిచ్చి తన హాట్‌నెస్‌తో కూల్ వాతావరణంలో కూడా హీట్‌నెస్ తెచ్చిన ఇల్లీ బేబి తాజాగా వర్కౌట్స్ సెల్ఫీ షేర్ చేసింది. ‘డే 48.. బర్న్ బేబి బర్న్’.. అంటూ ఇలియానా షేర్ చేసిన పిక్ బాగా వైరల్ అవుతోంది. ‘అయ్య బాబోయ్.. ఇంత అందం ఏంటి బాబోయ్.. చూసి తట్టుకోవడం మా వల్ల కాదు’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా, అభిషేక్ బచ్చన్‌తో నటిస్తున్న ‘బిగ్ బుల్’ షూటింగ్ దశలో ఉంది.
https://www.instagram.com/p/CCvwfjxgyh0/?utm_source=ig_web_copy_link