Ileana : ‘కిక్’ కాంబో.. ఇల్లీ బేబితో ఐదోసారి..
ఇలియానా అప్పుడప్పుడు అందాలారబోస్తూ ఫొటోషూట్స్, త్రో బ్యాక్ పిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేస్తుంది..

Ileana
Ileana: గోవా బ్యూటీ ఇలియానా కెరీర్ మాంచి పీక్స్‌లో ఉండగానే టాలీవుడ్ వదిలి బాలీవుడ్ వెళ్లింది. కట్ చేస్తే అక్కడ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అంతలోనే ఆండ్రూతో లోయలో అదేనండీ లవ్‌లో పడింది. విదేశాలకు చెక్కేసి కొన్నాళ్లు అతగాడితో సహజీవనం చేసింది. తర్వాత కొన్నాళ్లకే తనతో రిలేషన్ షిప్‌ని కట్టి కబోర్డ్‌లో పడేసింది.
Ileana D’Cruz: తన బాడీ పార్ట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..
ఇండియా తిరిగొచ్చాక అప్పుడప్పుడు అందాలారబోస్తూ ఫొటోషూట్స్, త్రో బ్యాక్ పిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేస్తుంది. నేనున్నానోచ్ అంటూ దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తున్నా పాపం పాపని పట్టించుకునేవారే కరువయ్యారు. అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్ బుల్’ తప్ప చేతిలో సినిమాలు లేవు.
అయితే అమ్మడు త్వరలోనే తిరిగి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజతో ఐదోసారి జతకట్టబోతోందట. ఇంతకుముందు ‘ఖతర్నాక్’, ‘కిక్’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాల్లో రవితేజ, ఇల్లీ బేబి కలిసి నటించారు. వీటిలో ‘కిక్’ మాత్రమే సూపర్ హిట్ అయ్యింది.
రవితేజ ‘ఖిలాడి’ తర్వాత కొత్త డైరెక్టర్ శరత్ మండవతో ‘రామారావు – ఆన్ డ్యూటీ’ అనే మూవీ చేస్తున్నారు. ఇందులో ఇలియానా చేత ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఎలాగూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. రవితేజతో మంచి రిలేషన్ ఉంది కాబట్టి స్పెషల్ సాంగ్ చెయ్యడానికి ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అనే మాట ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.
View this post on Instagram