Vishal : నేను సిగ్గుపడుతున్నా.. వర్షాల నేపథ్యంలో చెన్నై మేయర్‌కి ఘాటుగా పోస్టు పెట్టిన హీరో

చెన్నైలో మిచాంగ్ తుపాను విలయం సృష్టిస్తోంది. జన జీవనం అస్తవ్యవస్తం అయ్యింది. అక్కడి పరిస్థితుపై స్పందించిన విశాల్ నగర మేయర్, అధికారులనుద్దేశించి ఘాటు పోస్టు పెట్టారు. విశాల్ పోస్టు వైరల్ అవుతోంది.

Vishal

Vishal : మిగ్‌జామ్ తుపాను చైన్నైని వణికిస్తోంది. భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేసాయి. రోడ్లపై వరదనీరు బీభత్సం సృష్టిస్తోంది. జన జీవనం స్తంభించింది. అక్కడి పరిస్థితులపై హీరో విశాల్ స్పందించారు. చెన్నై మేయర్‌ని ఉద్దేశించి ఘాటు పోస్టు పెట్టారు. అధికారులను తన పోస్టులో ఏకి పారేశారు. విశాల్ పోస్టు వైరల్ అవుతోంది.

Sreeeleela : ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల మెరుపులు..

మిగ్‌జామ్ తుపాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పరిస్థితి దారుణంగా ఉంది. సబ్ వేలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులతో పాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర పనుల మీద బయటకు రాలేని పరిస్థితుల్లో జనం నానా అవస్థలు పడుతున్నారు. అక్కడి పరిస్థితులపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి పరిస్థితులపై చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (GCC) పూర్తిగా విఫలమైందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

విశాల్ చెన్నై మేయర్ శ్రీమతి ప్రియా రాజన్‌తో పాటు కమిషనర్, గ్రేటర్ చెన్నై సిబ్బందిని ఉద్దేశించి ఘాటైన పోస్టు పెట్టారు. ‘మీరందరూ సురక్షితంగా మీమీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాము. నీరు ముఖ్యంగా డ్రైనేజీ నీరు మీ ఇళ్లలోకి ప్రవేశించదు.. ముఖ్యంగా మీకు ఆహారం, విద్యుత్ అందుబాటులో ఉందని ఆశిస్తున్నాము. మేము అలాంటి పరిస్థితుల్లో లేము. వరద నీటి కాలువ ప్రాజెక్టు మొత్తం సింగపూర్ కోసం ఉద్దేశించబడినదా? చెన్నై కోసం ఉద్దేశించబడిందా? 2015 లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేమంతా రోడ్లపైకి వచ్చాము. మళ్లీ 8 సంవత్సరాల తర్వాత మరింత అధ్వాన్నమైన పరిస్థితిని చూడటం బాధ కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఆహార సామాగ్రి, మంచినీరు అందించడం వంటి సాయం మేము చేస్తూనే ఉంటాము.. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులంతా భయం, బాధతో ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రజలకు సాయం అందిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ విశాల్ ఘాటైన పోస్టు పెట్టారు. సున్నితంగా చెబుతూనే పరోక్షంగా అధికారులను ఏకిపారేశారు.

Dunki Trailer : షారుఖ్ ‘డంకీ’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీతో పాటు ఎమోషనల్..

విశాల్ ఈ పోస్టు చివర్లో ‘ఇది రాసేటపుడు నేను సిగ్గుతో తల దించుకున్నాను. ప్రజలకు అవసరాలను నెరవేర్చే సమయంలో ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూస్తూ కూర్చోకూడదు. గాడ్ బ్లెస్’ అంటూ ముగించారు. విశాల్ పోస్టు వైరల్ అవుతోంది. ఇక విశాల్ పోస్టుకు అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు మిగ్‌జామ్ తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడు వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.