Dunki Trailer : షారుఖ్ ‘డంకీ’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీతో పాటు ఎమోషనల్..

ఇప్పటికే నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు నాడు డంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు. ఆ తర్వాత ఓ రెండు పాటలని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ‘డంకీ' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లోనే సినిమా కథ అంతా చెప్పేశారు.

Dunki Trailer : షారుఖ్ ‘డంకీ’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీతో పాటు ఎమోషనల్..

Shah Rukh Khan Rajkumar Hirani Dunki Trailer Released

Dunki Trailer : బాలీవుడ్(Bollywood) బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan) పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తర్వాత ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి చేస్తున్న సినిమా ‘డంకీ’. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఈ సినిమా. ఇక డంకీ సినిమాని డిసెంబర్ 21న పాన ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.

ఇప్పటికే నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు నాడు డంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు. ఆ తర్వాత ఓ రెండు పాటలని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ‘డంకీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లోనే సినిమా కథ అంతా చెప్పేశారు.

ఒక ఊళ్ళో ఉండే అయిదుగురు స్నేహితులు ఎలాగైనా లండన్ వెళ్ళాలి అనుకుంటారు. అధికారికంగా వెళ్లాలి అంటే ఇంగ్లీష్ రావాలని అర్ధమవుతుంది. ట్రై చేసినా వీసా రిజెక్ట్ అవుతుంది. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు హిందీ రావాలని మనం రూల్ పెట్టామా? మరి మనకు ఇంగ్లీష్ ఎందుకు అని ఎలాగైనా లండన్ వెళ్లాలనుకుంటారు. అక్రమంగా దేశాలు దాటుతూ లండన్ ఎలా వెళ్లారు? ఈ క్రమంలో వారు వివిధ దేశాల నుంచి ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనేది కథగా ఉండబోతుంది. ట్రైలర్ మొదట కామెడీగా చూపించి ఆ తర్వాత ఎమోషనల్ గా చూపించారు. సినిమా కుడా మొదటి గంట ఫుల్ కామెడీతో ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : Jeevitha Rajashekar : మా ఆయన, నా కూతుళ్లే సర్వస్వం.. వాళ్ళ కోసం ఎవరితో ఎంత పెద్ద ఫైట్ అయినా చేస్తా..

ప్రస్తుతం ‘డంకీ’ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక షారుఖ్ ‘డంకీ’ సినిమా ప్రభాస్ సలార్ సినిమాకు ఒక్క రోజు ముందు రిలీజవ్వడం గమనార్హం. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి షారుఖ్ హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. మరి ‘డంకీ’ ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.