Indian Cinema : హద్దులు దాటిన ఇండియన్ సినిమా.. అదరగొడుతున్న ఓవర్సీస్ కలెక్షన్స్..

ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయింది. ఒకప్పుడు దేశీ మార్కెట్లో మాత్రమే సినిమాలు రిలీజ్ చేసే మేకర్స్ ఇప్పుడు ఓవర్సీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫ్యాన్స్ పెరగడం, ఇండియన్స్ వివిధ దేశాల్లో ఎక్కువగా సెటిల్ అవ్వడంతో కోట్ల కాసులు కురిపించే పెద్ద మార్కెట్ అయిపోయింది ఓవర్సీస్..............

Indian Cinema : హద్దులు దాటిన ఇండియన్ సినిమా.. అదరగొడుతున్న ఓవర్సీస్ కలెక్షన్స్..

Indian Cinema collects high collections in Overseas

Updated On : February 13, 2023 / 2:05 PM IST

Indian Cinema :  ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అందుకే ఎన్నాళ్లని లోకల్ రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటాం. గ్లోబల్ రికార్డుల్ని క్రియేట్ చేసి వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు కొల్లగొడదాం అని ఓవర్సీస్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నాయి సినిమాలు. ఒకప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే సినిమాలు ఇప్పుడు రష్యన్, జపనీస్, చైనీస్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. హ్యూజ్ మనీ, హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది కాబట్టే పనిగట్టుకుని ప్రమోషన్లు చేస్తూ, మరిన్ని కొత్త మార్కెట్లు ఓపెన్ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయింది. ఒకప్పుడు దేశీ మార్కెట్లో మాత్రమే సినిమాలు రిలీజ్ చేసే మేకర్స్ ఇప్పుడు ఓవర్సీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫ్యాన్స్ పెరగడం, ఇండియన్స్ వివిధ దేశాల్లో ఎక్కువగా సెటిల్ అవ్వడంతో కోట్ల కాసులు కురిపించే పెద్ద మార్కెట్ అయిపోయింది ఓవర్సీస్. సౌత్ సినిమాకి బాలీవుడ్ లో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో ఇండియన్ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా అలాంటి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇండియన్ సినిమాకి గ్లోబల్ వైడ్ గా రీచ్ పెరగడంతో అమెరికా, జపాన్, రష్యా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలలో కొత్త మార్కెట్ ఓపెన్ అయ్యి ఓవర్సీస్ కలెక్షన్లలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. 250, 300 కోట్లు ఒకప్పుడు ఓవరాల్ కలెక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రేంజ్ కలెక్షన్స్ జస్ట్ ఓవర్సీస్ మార్కెట్ నుంచే రాబడుతున్నాయి మన సినిమాలు.

ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్ ఇప్పుడు పెద్ద మార్కెట్ అయిపోయింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పఠాన్ ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లు రాబడుతోంది. 20 రోజుల క్రితం రిలీజ్ అయిన పఠాన్ ఇప్పటికే 950 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా అందులో దాదాపు 350 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినవే. 5 ఏళ్ల లాంగ్ బ్రేక్ తర్వాత గ్రాండ్ గా ధియేటర్లోకొచ్చిన షారూఖ్ 100 దేశాల్లో రిలీజ్ అయ్యి కలెక్షన్ల మోత మోగిస్తున్నాడు. షారూఖ్ కి గల్ఫ్ కంట్రీస్ తో పాటు మిగతా దేశాల్లో కూడా ఎక్కువ ఫాన్ ఫాలోయింగ్ ఉండడం, యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది పఠాన్.

పఠాన్ సినిమానేకాదు లాస్ట్ ఇయర్ భారీగా రిలీజైన బ్రహ్మాస్త్ర మూవీ ఓవర్సీస్ లో వన్ ఫోర్త్ కలెక్షన్లు రాబట్టింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణబీర్ సింగ్ , ఆలియా భట్ కాంబినేషన్లో అమితాబ్, నాగార్జున లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ఫిక్షన్ మైథాలజీ కాన్సెప్ట్ లో విజువల్ వండర్ గా తెరకెక్కి 400 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. బ్రహ్మాస్త్ర బాలీవుడ్ మూవీ అయినా సౌత్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయ్యింది. విజువల్స్ తోఆకట్టుకున్న ఈ సినిమాకు దాదాపు 115 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్లు వచ్చాయి. సినిమాలో 4వ వంతు కలెక్షన్లు ఓవర్సీస్ నుంచే వచ్చాయంటే బాలీవుడ్ మార్కెట్ నెక్ట్స్ లెవల్ లో స్ప్రెడ్ అయ్యిందని చెప్పొచ్చు.

బాలీవుడ్ సినిమాలకు ఇప్పటి వరకూ ఓవర్సీస్ అన్ బీటబుల్ రికార్డ్ దంగల్ పేరుమీదే ఉంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఆమిర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా దంగల్ మూవీ అప్పటి వరకూ ఉన్న ఓవర్సీస్ రికార్డుల్ని చెరిపేసింది. 2016 లో రిలీజ్ అయిన సినిమాని ఆస్ట్రేలియా, జపాన్ లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత 2017లో చైనా, హాంగ్ కాంగ్, తైవాన్ లాంటి చాలా దేశాల్లో రిలీజ్ అయిన దంగల్ మూవీ అక్కడ కూడా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోయింది. 2018లో సౌత్ కొరియా, టర్కీ దేశాల్లో రిలీజ్ అయి ఓవరాల్ గా 2 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన దంగల్ మూవీ ఓవర్సీస్ లోనే 1500 కోట్లకుపైగా కలెక్ట్ చేసి ఇప్పటికీ అన్ బీటబుల్ రికార్డ్ గా ఓవర్సీస్ లో టాప్ ప్లేస్ లో ఉంది.

లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ గోల్డెన్ గ్లోబల్ తెచ్చుకోవడంతో ఇండియన్ సినిమాకున్న సక్సెస్ తో పాటు కలెక్షన్ల స్టామినా కూడా ప్రూవ్ అయ్యింది. ట్రిపుల్ ఆర్ కంటే ముందు బాహుబలి ఫస్ట్ టైమ్ 2 వేలకోట్ల కలెక్షన్ల మైల్ స్టోన్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. చైనా, జపాన్ దేశాలు బాహుబలిని సూపర్ హిట్ చేసి అక్కడ ప్రభాస్ కి ఫ్యాన్ క్లబ్ లు కూడా ఏర్పాటు అయ్యేలా చేశాయి. ఆ రేంజ్ లో టోటల్ కలెక్షన్లలో వన్ ఫోర్త్ అంటే దాదాపు 400కోట్ల కలెక్షన్లను ఓవర్సీస్ లోనే రాబట్టింది బాహుబలి.

బాహుబలి తో ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లు రాబట్టి రాజమౌళి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ట్రిపుల్ఆర్ కి ఓవర్సీస్ లో స్పెషల్ ప్రమోషన్లు చేశారు. హాలీవుడ్ స్టార్ కాస్ట్ కూడా ఉండడంతో సినిమాకి కావల్సినంత క్రేజ్ వచ్చింది. ఇప్పటికే రాజమౌళికి ఉన్న క్రేజ్ తో పాటు ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలతో తెరకెక్కిన ట్రిపుల్ఆర్ ఇండియాలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఓవర్సీస్ లో రిలీజ్ అయిన 30కి పైగాదేశాల్లో కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. 400కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ అమెరికాతో పాటు జపాన్, చైనాలో భారీగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి తగినట్టు దాదాపు 1200కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే ట్రిపుల్ఆర్ 260 కోట్లు ఓన్లీ ఓవర్సీస్ ద్వారానే రాబట్టింది. అంతేకాదు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా సాధించి, ఆస్కార్ రేస్ లోఉండడంతో ట్రిపుల్ఆర్ మీద గ్లోబల్ వైడ్ గా క్రేజ్ పెరిగిపోయింది.

క్రేజ్ ని రాబట్టుకుని ఓవర్సీస్ లో తనకంటూ కొత్త మార్కెట్ క్రియేట్ చేసకున్నాడు పుష్ప. 2021 డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన పుష్ప చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ రెస్పాన్స్ చూసి లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రష్యాలో డబ్ చేసి మరీ పుష్ప మూవీని రిలీజ్ చేశారు. అమెరికాలోనే కాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కూడా గ్రాండ్ గా రిలీజైన పుష్ప సెకండ్ వీక్ కన్నా ధర్డ్ వీక్ లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టి కలెక్షన్ల వైజ్ గా కొత్త రికార్డ్ అందుకుంది. మొత్తం మీద 350 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప ఓవర్సీస్ లో 40 కోట్లు కలెక్ట్ చేసి ఫారెన్ లో కొత్త మార్కెట్ ఓపెన్ చేసింది.

తమిళ్ స్టార్ హీరో విజయ్ కి ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. వరసగా రిలీజ్ చేస్తున్న కాప్, యాక్షన్ మూవీస్ తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న విజయ్ వరిసు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అయినా కూడా దాదాపు 100కోట్ల కలెక్షన్లు రాబట్టి సినిమా టోటల్ కలెక్షన్లలో మూడో వంతు ఓవర్సీస్ కింద కలెక్ట్ చేసింది. ఇండియాలో వచ్చిన కలెక్షన్లతో సమానంగా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లు రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది అజిత్ మూవీ. ఈ సంక్రాంతి బరిలోకి దిగిన తెగింపు ఓవర్సీస్ లో 60 కోట్లు రాబట్టింది. లాస్ట్ ఇయర్ సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన వలిమై సినిమా ఓవరాల్ గ్రాస్ మొత్తం 250 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో దాదాపు సగం 115 కోట్లు ఓవర్సీస్ నుంచే వచ్చాయంటే నాన్ ఇండియన్ కలెక్షన్ ఏ రేంజ్ లో ఉందో ఆలోచించొచ్చు.

లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో 2022 సెప్టెంబర్ లో రిలీజ్ అయిన భారీ హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ గ్లోబల్ వైడ్ గా 500కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మంచి సక్సెస్ అందుకుంది. మణిరత్నం మ్యాజికల్ డైరెక్షన్లో కార్తి, విక్రమ్, ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ హ్యూజి్ మూవీ 150 కోట్లకు పైగా ఓవర్సీస్ కలెక్షన్లురాబట్టింది. పెద్దగా ఓవర్సీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ కాకపోయినా మణిరత్నం మేకింగ్, స్టార్ స్టడెడ్ యాక్టింగ్ కి ఫిదా అయిన జనాలు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు తెచ్చిపెట్టారు.

పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన మరో తమిళ్ మూవీ విక్రమ్ ఓవర్సీస్ లో దుమ్ము రేపింది. స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన విక్రమ్ లాస్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. కంప్లీట్ యాక్షన్ మూవీ గా వచ్చిన ఈ కమల్ హాసన్ స్టార్ స్టడెడ్ మూవీ దాదాపు 430 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. వాటిలో 125 కోట్లు ఓవర్సీస్ కలెక్షన్లే. కమల్ హాసన్ కి పాన్ వరల్డ్ క్రేజ్ తో పాటు కంటెంట్ రీచింగ్ తో ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టింది విక్రమ్ మూవీ.

ఒకప్పుడు రీజనల్ మార్కెట్ దాటి బయటికి రాని సినిమాలు కూడా ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించాయి. ఫస్ట్ టైమ్ ఇండియా వైడ్ గా సత్తా చాటటమే కాకుండా ఓవర్సీస్ లో కూడా కొత్త మార్కెట్ ఓపెన్ చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. కన్నడ సినిమాకు ఇప్పటి వరకూ ఓవర్సీస్ లో రాని ఓపెనింగ్స్ ,కలెక్షన్స్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలతో వచ్చి అక్కడకూడా హ్యూజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ సౌత్ లో తప్ప ఇండియా వైడ్ గా అంతగా మార్కెట్ లేని ఇండస్ట్రీ. అయితే ఇదంతా కెజిఎఫ్ 2 ధియేటర్లోకి రాకముందు వరకే. ఒక్క సారి రాకీ రంగంలోకి దిగి మొత్తం కలెక్షన్ల రికార్డుల్నే మార్చేశాడు. 2022 ఏప్రిల్ లో రిలీజ్ అయిన కెజిఎఫ్ తో కన్నడ సినిమా ఇండస్ట్రీ స్టామినాని పెంచడమే కాకుండా ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ మార్కెట్ ఓపెన్ చేసింది. 200కోట్లకు పైన ఓవర్సీస్ లోనే కలెక్షన్లు రాబట్టిందంటే కెజిఎఫ్ 2 ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అర్దం చేస్కోవచ్చు. 100కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన కెజిఎఫ్ 2 సినిమా 1200 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అయిన కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

#SidKiaraReception : సిద్దార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ రిసెప్షన్ వేడుక.. బాలీవుడ్ సెలబ్రిటీల హంగామా..

కెజిఎఫ్ సక్సెస్ గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే రిలీజ్ అయిన కాంతారా కూడా ఓవర్సీస్ దగ్గర ఖాతా ఓపెన్ చేసింది. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా ఓవర్సీస్ లోనే 45కోట్లు కలెక్ట్ చేసి కలెక్షన్స్ లో మేజర్ రోల్ ప్లే చేసింది. వరల్డ్ వైడ్ గా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దుమ్ము రేపిన కాంతారా రీజనల్ సబ్జెక్ట్ అయినా కూడా కోర్ ఎమోషన్ తో ఓవర్సీస్ లో కలెక్షన్లు రాబట్టింది. ఇలా గ్లోబల్ వైడ్ గా ఇండియన్ సినిమా క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ వరల్డ్ వైడ్ మార్కెట్స్ ఓపెన్ చేస్తూ అక్కడ హ్యూజ్ కలెక్షన్లతో ఓవర్సీస్ లోకూడా జెండా పాతేస్తోంది ఇండియన్ సినిమా.