Indiana Jones 5 : ‘ఇండియానా జోన్స్ 5’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాక్షన్, అడ్వెంచర్ సినీ ప్రియులను ‘ఇండియానా జోన్స్’ సినిమాలు ఎంతగానో అలరించాయి. నిధి వేట, అపురూప, అరుదైన వస్తువులను అన్వేషిస్తూ సాగే ఈ సిరీస్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

Indiana Jones OTT release
Indiana Jones OTT release : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాక్షన్, అడ్వెంచర్ సినీ ప్రియులను ‘ఇండియానా జోన్స్’ ( Indiana Jones) సినిమాలు ఎంతగానో అలరించాయి. నిధి వేట, అపురూప, అరుదైన వస్తువులను అన్వేషిస్తూ సాగే ఈ సిరీస్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. 1981లో మొదలైన ఈ యాక్షన్ అడ్వెంచర్స్ సిరీస్ లో ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్(1981), ది టెంపుల్ అఫ్ డూమ్(1984), ది లాస్ట్ క్రూసేడ్(1989), ది కింగ్డన్ అఫ్ ది క్రిస్టల్ స్కల్(2008) లు రాగా ఆఖరి చిత్రంగా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ (Indiana Jones 5) గా వచ్చింది.
Vishwak Sen : ఫ్యామిలీ ధమాకా.. దాస్ కా ఇలాకా.. టాలీవుడ్ ఫ్యామిలీస్‌తో విశ్వక్ సేన్ ఆట..
మొదటి నాలుగు సినిమాలకు ‘స్టీవెన్ స్పీల్బర్గ్’ దర్శకత్వం వహించగా ఆఖరి సినిమాని జేమ్స్ మాన్‌గోల్డ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా 30 జూన్ 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 300 మిలియన్లు డాలర్లతో వ్యయంతో ఈ సినిమాని తెరకెక్కించగా థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. మొత్తంగా 370 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టి ఫర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా డిజిటల్‌లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Dhoni : విజయ్ సినిమాలో ధోని.. ?
తాజాగా ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మొదటగా వీడియో ఆన్ డిమాండ్ పద్దతిన అందుబాటులోకి రానుంది. అంటే సినిమా చూడాలంటే కొద్ది మొత్తంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా డిస్నీ+హాట్‌స్టార్‌లోనూ ఈ సినిమాను తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో స్ట్రీమింగ్ ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం ఇంకా తెలియరాలేదు.