ఇంట్రెస్టింగ్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ : ట్రైలర్

రీసెంట్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందీ ట్రైలర్..

  • Published By: sekhar ,Published On : May 2, 2019 / 09:50 AM IST
ఇంట్రెస్టింగ్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ : ట్రైలర్

Updated On : May 2, 2019 / 9:50 AM IST

రీసెంట్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందీ ట్రైలర్..

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.. భారతదేశంలో ఎన్నో దాడులకు పాల్పడిన ఇండియాస్ ఒసామా అనే ఉగ్రవాది నేపథ్యంలో రూపొందించిన సినిమా ఇది. ఆ ఇండియాస్ ఒసామా ఎవరో, ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అతణ్ణి పట్టుకోవడానికి ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించకుండా, ఇండియాకి చెందిన ఐదుగురు వ్యక్తులు ఎలాంటి రిస్క్ చేసారు? అనేదే ఈ మూవీ స్టోరీ. రీసెంట్‌గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందీ ట్రైలర్..

అర్జున్ కపూర్ ఆ ఐదుగురిలో ఒకడిగా, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ప్రభాత్‌గా కనిపించనున్నాడు. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్‌లో, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, రాజ్ కుమార్ గుప్తా మరియు మైరా కార్న్ సంయుక్తంగా నిర్మించారు. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటింగ్ : బోధాదిత్య బెనర్జీ, మ్యూజిక్ : అమిత్ త్రివేది.

వాచ్ ట్రైలర్..