Indo American Singer AP Dhillon Breaks Guitar on Stage Video goes Viral
AP Dhillon : ఇటీవల స్టేజి పర్ఫార్మెన్స్, కాన్సర్ట్ లు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ కాన్సర్ట్స్ లో పాల్గొనడాన్నికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక విదేశాల్లో అయితే మ్యూజిక్ కాన్సర్ట్ లు మరింత ఎక్కువగా జరుగుతాయి. తాజాగా ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో ఇండో అమెరికన్ సింగర్ AP ధిల్లాన్ స్టేజిపై గిటార్ పగలగొట్టడంతో ఈ వీడియో వైరల్ గా మారి విమర్శలకు దారి తీసింది.
పంజాబీ మ్యూజిక్ తో బాగా ఫేమస్ అయ్యాడు ఇండో అమెరికన్ సింగర్ AP ధిల్లాన్. అతని ప్రైవేట్ ఆల్బమ్స్ కి ఇక్కడ ఇండియాలో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా కాలిఫోర్నియా లో కోచెల్ల మ్యూజిక్ ఫెస్టివల్ లో AP ధిల్లాన్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కాన్సర్ట్ కి భారీగా జనాలు వచ్చారు. అయితే పాటలు పాడి ఉర్రూతలూగించిన ధిల్లాన్ చివర్లో ప్రోగ్రాం అయిపోయే సమయంలో అప్పటిదాకా తాను వాయించిన గిటార్ ని నేలకేసి పగలగొట్టాడు. గిటార్ పగలగొట్టి అదే ఆవేశంతో స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు.
Also Read : Geethanjali Malli Vachindhi : ‘గీతాంజలి’ మెట్రో ట్రైన్ ఎక్కింది.. ఇది వేరే లెవల్ ప్రమోషన్స్..
దీంతో ధిల్లాన్ గిటార్ పగులగొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ ధిల్లాన్ పై విమర్శలు చేస్తున్నారు. గిటార్ పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? మన ఇండియాలో సంగీత పరికరాలకి పూజిస్తాం, సరస్వతి రూపంగా చూస్తాము, అలాంటిది ఇలా పగలగొట్టావు, ఫేమ్ రాగానే, స్టార్ అవ్వగానే ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు, విదేశాల్లో కొంతమంది ర్యాపర్స్ నుంచి చూసి నేర్చుకున్నట్టు ఉన్నాడు, మరింత పాపులర్ అవడానికి పబ్లిసిస్టి స్టంట్స్, నీకు ఫుడ్ పెడుతున్న వాటని గౌరవించడం నేర్చుకో.. అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కామెంట్స్ రూపంలో AP ధిల్లాన్ ని విమర్శిస్తున్నారు. అయితే దీనిపై ధిల్లాన్ ఇంకా స్పందించలేదు.