PVR – INOX : వినోద పరిశ్రమలో భారీ విలీనం.. ఇకపై పీవీఆర్, ఐనాక్స్ ఒకటే..

తాజాగా వినోదరంగంలో అతి పెద్ద డీల్ అయిన ఈ విలీనంపై అధికారిక ప్రకటన వెల్లడైంది. దేశంలోనే అతి పెద్ద మల్టీఫ్లెక్స్ చైన్ కలిగి ఉన్న పీవీఆర్ లో ఐనాక్స్ విలీనమై ఒక్కటిగా మారాయి.

Pvr Inox

 

PVR – INOX :  కరోనా మహమ్మారి దెబ్బకు చాలా రంగాలు నష్టపోయాయి. అందులో వినోద రంగం బాగా నష్టపోయింది. సినిమా థియేటర్లు క్లోజ్ చేయడంతో థియేటర్లు, మల్టిప్లెక్స్ లు తీవ్రంగా నష్టపోయాయి. ఇలాంటి సమయంలో కరోనా నష్టాన్ని నివారించేందుకు దేశంలో మల్టిప్లెక్స్ లు కలిగిన అతిపెద్ద సంస్థలు ఒక్కటవుదామని నిశయించుకున్నాయి. పీవీఆర్ మల్టిప్లెక్స్, ఐనాక్స్ మల్టిప్లెక్స్ కలిసి ఒకే సంస్థగా ఏర్పడాలని భావించి రెండు సంస్థల్ని విలీనం చేద్దాం అనుకున్నారు. దీనిపై గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు.

తాజాగా వినోదరంగంలో అతి పెద్ద డీల్ అయిన ఈ విలీనంపై అధికారిక ప్రకటన వెల్లడైంది. దేశంలోనే అతి పెద్ద మల్టీఫ్లెక్స్ చైన్ కలిగి ఉన్న పీవీఆర్ లో ఐనాక్స్ విలీనమై ఒక్కటిగా మారాయి. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న పీవీఆర్, ఐనాక్స్ లు ఒక్కటిగా మారి పీవీఆర్ ఐనాక్స్ గా ఇకపై తమ కార్యకలాపాల్ని నడపనున్నాయి. ఈ రెండు సంస్థల విలీనానికి సంబంధించి రెండు కంపెనీలకు చెందిన డైరెక్టర్ల బోర్డులు ఓకే చెప్పాయి.

Naga Shaurya : వెంకటేష్ కంటే బాగా చూసుకుంటా.. ‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ రిలీజ్..

ఇప్పటివరకు దేశం మొత్తం మీద పీవీఆర్ సంస్థకు 73 నగరాల్లో 181 ప్రదేశాల్లో మొత్తం 871 స్క్రీన్లు ఉన్నాయి. పీవీఆర్ వార్షిక టర్నోవర్ రూ.698 కోట్లు కాగా ఇతర ఆదాయం రూ.472 కోట్లు. మొత్తం ఆస్తులు రూ.7450 కోట్లు ఉన్నాయి. ఇక ఐనాక్స్ విషయానికి వస్తే ఈ సంస్థ మొత్తం 72 నగరాల్లో 160 ప్రదేశాల్లో 675 స్క్రీన్లను నడుపుతోంది. దీని వార్షిక టర్నోవర్ రూ.148 కోట్లు కాగా, ఇతర ఆదాయం రూ.42 కోట్లు మాత్రమే. మొత్తం ఆస్తులు రూ.3784 కోట్లు ఉన్నాయి.

Varun Tej : మరో కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్‌తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో

ఇక ఈ రెండు సంస్థలు కలవడంతో పీవీఆర్ ఐనాక్స్ ఆధ్వర్యంలో 109 నగరాల్లో 341 ప్రదేశాల్లో మొత్తం 1546 స్క్రీన్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో కొత్త స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. విలీనం తర్వాత ఏర్పాటయ్యే బోర్డులో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ విలీనంతో వినోద రంగంలో కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఇక ఇప్పట్లో వీటికి పోటీ వచ్చే మల్టిప్లెక్స్ సంస్థలు ఏవి లేవు.