Varun Tej : మరో కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్‌తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో

తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. డైరెక్టర్ గా విభిన్నమైన కథలతో అలరించే ప్రవీణ్ సత్తారు వరుణ్ ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు..................

Varun Tej : మరో కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్‌తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో

Varun Tej (1)

Varun Tej :  మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభం ‘ముకుంద’ నుంచి కూడా సినిమా సినిమాకి వ్యత్యాసం చూపిస్తూ కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇప్పుడున్న హీరోలలో తక్కువ టైంలో ఎక్కువ డిఫరెంట్ స్టోరీలు తీసిన హీరో వరుణ్ అనే చెప్పొచ్చు. వరుణ్ త్వరలో ‘ఎఫ్ 3’ సినిమాతో రానున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ రోజు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

Vijay Devarakonda : నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ.. విజయ్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన పూరి

డైరెక్టర్ గా విభిన్నమైన కథలతో అలరించే ప్రవీణ్ సత్తారు వరుణ్ ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జున హీరోగా ‘ది ఘోస్ట్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఉంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇవాళ అధికారికంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. వరుణ్ తండ్రి నాగబాబు క్లాప్ కొట్టగా, వరుణ్ తల్లి పద్మజ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.