Vijay Devarakonda : నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ.. విజయ్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన పూరి

విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా కూడా పూరితోనే ఉండబోతుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమాని అనౌన్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ఇంట్రెస్టింగ్........

Vijay Devarakonda : నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ.. విజయ్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన పూరి

Vijay Devarakonda

Puri Jagannadh :  విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాని ఆగస్టు 25న పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా కూడా పూరితోనే ఉండబోతుంది అని ఇటీవల ఊహాగానాలు వచ్చాయి. జనగణమన అనే స్క్రిప్ట్ విజయ్ తో తీయనున్నారు పూరి అని వార్తలు కూడా వచ్చాయి.

 

తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమాని అనౌన్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ పై విజయ్, పూరిలతో పాటు 14.20 అనే టైం, అలాగే 19.0760 n 72.8777 e లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లని పోస్ట్ చేస్తూ నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ రాశారు. అలాగే 29 మార్చ్ 2022 అని డేట్ కూడా పోస్టర్ పై వేశారు. అయితే ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లని మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే ముంబైలోని లొకేషన్స్ ని చూపిస్తుంది.

Oscar Awards : ఆస్కార్ వేడుకల్లో ఊహించని సంఘటన.. కమెడియన్‌ని కొట్టిన బెస్ట్ యాక్టర్ విల్‌స్మిత్

అంటే వీళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం 29 మార్చ్ 2022న మధ్యాహ్నం 14.20కి విజయ్, పూరి సినిమా ముంబైలో లాంచ్ చేయనున్నట్టు అర్ధమవుతుంది. ఇలా డిఫరెంట్ గా పోస్ట్ చేసి పూరి తన మార్క్ ని చూపించాడు. ఇక ఈ సినిమాని కూడా పూరి జగన్నాధ్ నిర్మాణంలో, అలాగే బాలీవుడ్ కి సంబంధించిన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. వీటి గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.