Kamala Selvaraj
Kamala Selvaraj : మహానటి సినిమా చూసిన వారందరికీ సావిత్రి, జెమినీ గణేశన్ స్టోరీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేకపోయినా వారి కథలో ఇప్పటికీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన కూతురు కమల సెల్వరాజ్ తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. సావిత్రి గురించి కూడా.
SDT 17 : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్.. SDT 17 త్రిశూలంతో పవర్ ఫుల్ లుక్..
జెమినీ గణేశన్, సావిత్రి ఇద్దరు మహానటులే. ఎన్నో సినిమాల్లో నటించి తెరపై పేరు తెచ్చుకున్నవారే. వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు. జెమినీ గణేశన్ జీవితంలోకి మూడవ భార్యగా వెళ్లిన సావిత్రి.. ఆ తరువాత అనేక కష్టాలు పడ్డారు. మహానటి సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర అవాస్తవంగా చూపించారంటూ ఆ సినిమా రిలీజైన కొత్తలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మండిపడ్డారు. రీసెంట్‌గా ఆయన కుమార్తె కమల సెల్వరాజ్ తండ్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
మహానటి సినిమాలో చూపించిదంతా అవాస్తవమని కొట్టి పారేసారు కమల సెల్వరాజ్. తన తండ్రి కోసం ఇంటి ముందు ఆడపిల్లలు క్యూ కట్టేవారని.. ఏ ఆడపిల్లని పెళ్లి చేసుకోమని ఆయన అడగలేదని అన్నారామె. చాలామంది సీక్రెట్ మ్యారేజ్‌లు చేసుకున్నవారు ఉన్నారని.. పుష్పవల్లి, సావిత్రిలతో తన తండ్రి పెళ్లి విధి రాత వల్ల జరిగిందన్నారామె. తన తండ్రి చాలా అందగాడని.. బాగా చదువుకున్నవాడని.. ఆయన జీవితం తెరచిన పుస్తకం అని ఆమె మాట్లాడారు.
Sreeleela : బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాపై.. శ్రీలీల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
‘మహానటి’ కేవలం మూవీ మాత్రమే అని జెమినీ గణేశన్ పిల్లలుగా ఆయనేంటో మాకు తెలుసు అన్నారు కమల సెల్వరాజ్. సావిత్రిగారితో తమకు ఎలాంటి విభేదాలు లేవని తమని ఆవిడ బాగా చూసుకునేవారని చెప్పారు. జెమినీ గణేశన్ పిల్లలు, సావిత్రి పిల్లలు అనే డిఫరెన్స్ లేకుండా అందరం టచ్‌లో ఉన్నామని స్పష్టం చేసారు. ప్రస్తుతం కమల సెల్వరాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కమల సెల్వరాజ్ చెన్నైలో గైనకాలజిస్ట్ గా ఉన్నారు. 1990 లో ఇండియాలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించిన వైద్యురాలిగా కమల సెల్వరాజ్ పేరు తెచ్చుకున్నారు.