Interesting Facts About Little Hearts Director Sai Marthand
Sai Marthand: లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని లెవల్లో కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాలో వినోదం చక్కగా పండటంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలను సైతం పక్కన పెట్టేసి ఈ సినిమాను చూస్తున్నారు. దాంతో, ఈ సినిమా నటీనటులు, ముఖ్యంగా దర్శకుడిపైన ప్రశంసలు వస్తున్నాయి.
ఈ సినిమాను తెరకెక్కించింది సాయి మార్తాండ్(Sai Marthand). ఈ కుర్ర దర్శకుడి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, సాయి మార్తాండ్ మరెవరో కాదు అలనాటి దిగ్గజ దర్శకుడు బీవీ ప్రసాద్ మనవడు. ఈ లెజెండ్ దర్శకుడు ఎన్టీఆర్ తో మేలు కొలుపు, ఆరాధన.. కృష్ణ తో చుట్టాలున్నారు జాగ్రత్త.. చిరంజీవితో తాతయ్య ప్రేమ లీలలు వంటి గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించారు. ఆయన తన కెరీర్ మొత్తంలో 20కి పైగా అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు.
ఇప్పుడు, అంటే దాదాపు 35 ఏళ్ళ తరువాత ఆయన మనవడు సాయి మార్తాండ్ మళ్ళీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి లిటిల్ హార్ట్స్ సినిమాను తెరక్కించారు. కేవలం సినిమా చేయడమే కాదు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపధ్యలోనే దర్శకుడు సాయి మార్తాండ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. మీ తాత పేరు నిలబెట్టావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి మార్తాండ్ విషయానికి వస్తే.. ఆయన ముందు నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకున్నాడు కానీ, తనకోసం ఎవరు కథలు రాయకపోవడంతో తానే కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. ఆలా లిటిల్ హార్ట్స్ కథ రాసుకున్నాడు. అదే సమయంలో మౌళి హీరోగా 90’స్ బయోపిక్ రావడంతో ఆయనకు కథను వినిపించి దర్శకుడిగా మారాడు సాయి మార్తాండ్.