Bigg Boss Season 9: బిగ్ బాస్ 9లో ఫస్ట్ నామినేషన్స్ ఫైర్.. టార్గెట్ సంజన.. వెన్నుపోటు, అబద్దాలు ఆడుతున్నారు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో నామినేషన్స్ హీట్ మొదలయ్యింది.(Bigg Boss Season 9) మొదటి వారం నామిషన్స్ కి రంగం సిద్ధం చేశారు బిగ్ బాస్.

Bigg Boss Season 9: బిగ్ బాస్ 9లో ఫస్ట్ నామినేషన్స్ ఫైర్.. టార్గెట్ సంజన.. వెన్నుపోటు, అబద్దాలు ఆడుతున్నారు

The first nomination process started in Bigg Boss Season 9.

Updated On : September 9, 2025 / 12:12 PM IST

Bigg Boss Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో నామినేషన్స్ హీట్ మొదలయ్యింది. మొదటి వారం నామిషన్స్ కి రంగం సిద్ధం చేశారు బిగ్ బాస్. ఇక నుండి అసలు రచ్చ, అసలు ఆట మొదలుకానుంది. దీనికి సంబందించిన ప్రోమో విడుదల అయ్యింది. చాలా ఇంటరెస్టింగ్ గా కూడా ఉంది. అయితే, ఈ ప్రోమోలో(Bigg Boss Season 9) కంటెస్టెంట్స్ సంజనను టార్గెట్ చేయడం ప్రత్యేకంగా మారింది.

Shriya Saran: శ్రియ సెంటిమెంట్ తో మిరాయ్ బ్లాక్ బస్టర్.. ఒకటికాదు ఏకంగా రెండు!

బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటికే కామనర్స్ ఓనర్లుగా, సెలబ్రిటీలు టెనెంట్స్ ఉన్నారు. ఇక సీజన్ 9లో ఫస్ట్ నామినేషన్స్ లో భాగంగా ఓనర్స్ అందరూ కలిసి టెనెంట్స్ లో ఒకరిని నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. ఓనర్స్ అందరూ వెళ్లి డిస్కస్ చేసుకొని సంజన గల్రానీని నామినేట్ చేయాలనుకుంటారు. ఇదే విషయాన్ని మర్యాద మనీష్ వివరిస్తూ.. మేమందరం కలిసి యునానిమస్ గా సంజన నామినేట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తాడు. దానికి వివరణగా.. మీ వల్ల వేరే ప్లేయర్లు హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది. మిస్ అండర్ స్టాండింగ్స్ వస్తున్నాయి అని చెప్తాడు. మీరు అబద్ధాలు కూడా ఆడుతున్నారని వివరిస్తాడు.

దానికి స్పదించిన సంజన.. మీ ఆరుగురిలో వాటర్ తాగడానికి ఇంట్లోకి వస్తే పర్మిషన్ కావాలాని నాకు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నిస్తుంది. అది బిగ్ బాస్ ముందే చెప్పాడని ప్రియ సమాధానం ఇవ్వడంతో గొడవ స్టార్ట్ అవుతుంది. మీరు బ్యాక్ బిచింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అని ప్రియ అనగా.. ఆ పదం వాడినందుకు సీరియస్ అయ్యింది సంజన. అలాంటి పదాలు వాడొద్దని వాదించింది. అనంతరం, బ్యాక్ బిచింగ్ గురించి సంజన, ఆషా షైనీ కూడా వాదించుకున్నారు. నువ్వు మూడు సార్లు నా రిలేషన్ గురించి ఎందుకు మాట్లాడారని ఆషా షైనీ సంజనాను ప్రశ్నిస్తుంది. దీంతో ప్రోమో ఎండ్ అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే బ్యాక్ బాచింగ్ అనే అంశం గురించి చాలా పెద్ద రచ్చనే జరిగినట్టుగా అనిపిస్తుంది. మరో ఫైనల్ ఎపిసోడ్ ఎంతవరకు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే మరొకొన్ని గంటలు ఆగాల్సిందే.