Interesting Love Reddy Trailer Released by SKN
Love Reddy : అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా తెరకెక్కిన సినిమా లవ్ రెడ్డి. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాణంలో స్మరన్ రెడ్డి దర్శకత్వంలో ఈ లవ్ రెడ్డి సినిమా తెరకెక్కింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ కొత్త ప్రేకథతో ఈ సినిమా రాబోతుంది.
Also Read : OG shooting update : OG షూట్ కూడా మొదలు పెట్టబోతున్న పవన్.. OG అప్డేట్..
తాజాగా లవ్ రెడ్డి సినిమా ట్రైలర్ నిర్మాత SKN చేతుల మీదుగా రిలీజ్ చేసారు. కర్ణాటక – ఆంద్ర బోర్డర్ రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే ప్రేమ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. మీరు కూడా ఈ లవ్ రెడ్డి ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్మాత SKN మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. 20 మంది కొత్తవాళ్లు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు అని అందరికి అల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అక్టోబర్ 18న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.