Prabhas: విక్రమాదిత్య లుక్ చూశారా!

  • Published By: sekhar ,Published On : October 21, 2020 / 12:35 PM IST
Prabhas: విక్రమాదిత్య లుక్ చూశారా!

Updated On : October 21, 2020 / 1:07 PM IST

#RadheShyamSurprise: రెబల్ స్టార్ ప్రభాస్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పాన్ ఇండియా మూవీ‘‘రాధేశ్యామ్’’. ‘బాహుబలి1, బాహుబలి2 , సాహో’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా ఇది.



తాజాగా #RadheShyamSurprise రివీల్ చేశారు మూవీ యూనిట్. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విక్రమాదిత్య క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టైలిష్ లుక్‌లో డార్లింగ్ చాలా బాగున్నాడు.



అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నారు. రాధేశ్యామ్ ప్ర‌స్తుతం యూర‌ప్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Image

Image

Image