Dr.Rajasekhar : పవర్‌ఫుల్ ‘శేఖర్’ గా డా.రాజ‘ ‘శేఖర్’..

సరికొత్త క్యారెక్టర్‌లో ‘శేఖర్’ గా డా.రాజ ‘శేఖర్’..

Dr.Rajasekhar : పవర్‌ఫుల్ ‘శేఖర్’ గా డా.రాజ‘ ‘శేఖర్’..

Shekar

Updated On : November 22, 2021 / 12:02 PM IST

Dr.Rajasekhar: పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రముఖ నటుడు, యాంగ్రీ స్టార్, అగ్రెసివ్ హీరో, డా.రాజశేఖర్ ‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో వరుస విజయాలు ఖాతాలో వేసుకున్నారు.

LIGER : హీరో హీరోయిన్ల హార్స్ రైడింగ్..

ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’.. Man With The Scar పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్.. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

Radhe Shyam : వీక్ అంతా ఊపు ఊగిపోద్దిగా..

రాజశేఖర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో, సరికొత్తగా కనిపించనున్నారు. సోమవారం ఈ సినిమా నుండి న్యూ అప్‌డేట్ వచ్చింది. నవంబర్ 25న ‘శేఖర్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘శేఖర్’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Eligible Bachelor : ‘ఆహా’ లో అదరగొడుతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..