జైళ్లో కరోనా బారినపడ్డ సర్జరీ స్టార్.. అయినా నో బెయిల్ అంటున్న జడ్జి..
ఇరానియన్ ఇన్స్టాగ్రామ్ స్టార్ సహర్ తబార్ కరోనా బారిన పడింది..
ఇరానియన్ ఇన్స్టాగ్రామ్ స్టార్ సహర్ తబార్ కరోనా బారిన పడింది..
కరోనా మహమ్మారి రోజురోజుకి ప్రపంచాన్ని వణికిస్తోంది. సినీరంగానికి సంబంధించి ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడగా.. కొందరు రికవరీ అయ్యారు. మరికొందరు కన్నుమూశారు. తాజాగా మరో సెలబ్రిటీ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ స్టార్‌గా పాపులర్ అయిన 22 ఏళ్ల Sahar Tabar(సహర్ తబార్) కరోనా వైరస్బారినపడింది. ఇరానియన్ స్టార్ అయిన ఈమె ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంది.
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా తన రూపురేఖలను మార్చుకునేందుకు 50కిపైగానే సర్జరీలు చేయించుకుని అవి బెడిసికొట్టి వికృతంగా తయారు అయింది సహర్ తబార్. ఈమె అసలు పేరు Fatemeh Khishvand (ఫతేమే ఖిష్వండ్). విచిత్రమైన రూపమే ఆమెను పాపులరిటీ తెచ్చింది. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దైవదూషణ, హింసను ప్రేరేపించడం, యువకులను అవినీతికి ప్రోత్సహించడం, అక్రమ మార్గాల్లో ఆదాయాన్ని పొందడం వంటి పలు ఆరోపణలపై గతేడాది అక్టోబరులో తబార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
జైలులో ఉన్న ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్నప్పటికీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించినట్టు ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘం పేర్కొంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇరాన్ ప్రభుత్వం వివిధ జైళ్లలో ఉన్న 85 వేల మంది ఖైదీలను విడుదల చేసింది.