Ticket Rates: పెరిగిన టికెట్ రేట్లు.. సినిమాకు వరమా.. శాపమా?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతకొద్ది రోజులుగా వరుసగా బడా చిత్రాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కించినవి అవడంతో...

Ticket Rates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతకొద్ది రోజులుగా వరుసగా బడా చిత్రాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కించినవి అవడంతో, ఈ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాలు. దీని ద్వారా సదరు చిత్ర నిర్మాతలు నష్టాలపాలు కాకుండా ఉంటారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి ఈ పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు వరంగా మారాయా లేక శాపంగా మారాయా..?

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

కరోనా ప్రభావంతో సగటు మనిషి జీవితం తారుమారయ్యింది. ఇప్పుడిప్పుడే బతుకు బండి తిరిగి పట్టాలెక్కుతోంది. ఇలాంటి సమయంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ఓ సామాన్య మనిషి, కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎంతమేర ఖర్చు పెట్టగలడు? ఈ చిన్న లాజిక్ మిస్ చేసుకున్న సినీ పరిశ్రమ వరుసగా సినిమాలను భారీ టికెట్ రేట్లతో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటుందా? అంటే.. అవుననే అనాలి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ రోజున టికెట్ దొరకడం గగనంగా మారేది. అప్పట్లో టికెట్ రేటు సాధారణంగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్‌లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!

పెరిగిన టికెట్ రేట్లతో సినిమా చూసేందుకు సగటు ప్రేక్షకుడు కాదు కదా.. ఆయా స్టార్ హీరోల అభిమానులు సైతం థియేటర్లకు వెళ్లడం లేదు. దీంతో భారీ బడ్జెట్ చిత్రాలకు కనీస ఆదరణ లేక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు తొలిరోజు తొలి ఆటకు కూడా హౌజ్‌ఫుల్ బోర్డు పడటం లేదు. ఇంతలా పరిస్థితి మారిందంటే, సినిమా టికెట్ల రేట్లు సినిమాపై ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే థియేటర్ వద్ద మూడు రోజుల పాటు సందడి వాతావరణం కనిపించేది. హౌజ్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు కిటకటలాడేవి. కానీ ఇప్పుడు.. మూడు రోజులు కాదు కదా.. తొలిరోజు కూడా కామన్ ఆడియెన్స్ ఎవరూ సినిమా థియేటర్ వైపు వెళ్లడం లేదు. వారు టికెట్ రేట్లు తగ్గే వరకు వెయిట్ చేసి మరీ సినిమా చూడటానికే ఆసక్తిని చూపుతున్నారు. మరి ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో.. మళ్లీ సినిమా థియేటర్ల వద్ద హౌజ్‌ఫుల్ బోర్డులు ఎప్పుడు కనిపిస్తాయో.. చూడాలి.

ట్రెండింగ్ వార్తలు