Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్‌లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!

సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి మొదలైంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీపై మొదట్నుండీ భారీ అంచనాలున్నాయి.

Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్‌లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!

Sarkaru Vaari Paata

Updated On : May 12, 2022 / 3:03 PM IST

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి మొదలైంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీపై మొదట్నుండీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ప్రమోషన్లలో దర్శకుడి దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. హీరో మహేష్ కూడా డ్యాం షూర్ పోకిరి దూకుడు తరవాత ఆ స్థాయి సినిమాగా సర్కారు వారి పాట నిలుస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు.

Sarkaru Vaari Paata : థియేటర్లో మహేష్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ యాజమాన్యంతో గొడవ..

మొత్తంగా ఈరోజు సినిమా థియేటర్లలో రావడంతో మహేష్ అభిమానులకు పండగ మొదలైంది. మహేష్ అభిమానులకు పండగ లాంటి సినిమానే అన్నది ఫస్ట్ షోతో ఫిక్స్ అయిపోగా.. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది మోస్తరు సినిమానే అన్నది కూడా అంతే డ్యామ్ షూర్ గా రివ్యూలు వచ్చేశాయి. సర్కారు వారి పాట బృందం చెప్పినంతగా ఆహా ఓహో రేంజ్ అనే సినిమా కాకపోయినా మహేష్ అభిమానులు మళ్ళీ మళ్ళీ చూసేంతగా సినిమా ఆకట్టుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.

Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?

కాగా.. స్టార్ హీరోలు.. అందునా టాప్ హీరోల సినిమాలకు యాంటీ ఫ్యాన్స్ దాడి ఈ మధ్య కాలంలో సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు మహేష్ కు ఆ దాడి తప్పలేదు. ఉదయం బెనిఫిట్ షో నుండే సినిమా బాగాలేదంటూ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. ఇది ఏ స్థాయికి చేరిందంటే ఏకంగా #DisasterSVP అనే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచేంత. ఈ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ఇండియా వైడ్ ట్రెండ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని మరీ ట్వీట్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ యాంటీ దాడిని మహేష్ ఎలా తట్టుకొని నిలబడతాడో చూడాలి.