Prabhas : ‘స‌లార్ 2’ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా? గ్యాప్ తీసుకోబోతున్న ప్ర‌భాస్‌ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

Is Salar 2 a difficult task now Is Prabhas going to take a gap

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవల కల్కి 2898 ADతో ఫ్యాన్స్‌ అలరించిన డార్లింగ్, ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా షూటింగ్‌ కూడా చేస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాత సలార్ 2 శౌర్యాంగ పర్వంపై దృష్టి పెట్టబోతున్నారట.

అయితే సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ పెద్ద గ్యాప్ తీసుకోబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సలార్ ఫస్ట్ పార్ట్‌ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించినప్పటికీ, సీక్వెల్‌కు సంబంధించి ప్రభాస్ నుంచి ఎలాంటి స్పష్టమైన అప్‌డేట్ రాకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తోంది.

Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు’లో పవన్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా ?

సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సలార్-2ను త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ షెడ్యూల్‌లో డ్రాగన్.. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. దీంతో సలార్-2 కాస్త ఆలస్యం అవుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.

దిల్‌రాజు రావణం అనే భారీ సినిమా అల్లుఅర్జున్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సలార్-2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై స్పష్టత లేదు. సలార్ 2 కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ చేస్తున్న ది రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఆ తర్వాత హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్‌ మూవీస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.