Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు’లో పవన్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా ?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు.

Director Jyothi Krishna shared interesting fact pawan kalyan role in Hari Hara Veeramallu movie
పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్‌ల నుంచి ప్రేరణ పొంది హరి హర వీరమల్లు చిత్రంలో పవన్ పాత్ర ను రూపొందించినట్లు చెప్పారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ లోనూ అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని తెలిపారు. సీఎం అయిన తరువాత కూడా ఎంజీఆర్ సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నట జీవితాన్ని కొనసాగించారు. ఇదే అంశం నాకు స్ఫూర్తినిచ్చింది. అందుకనే ఈ చిత్రంలో మాట వినాలి అనే పాటను పెట్టినట్లుగా చెప్పారు. ఈ పాట ఆలోచింపజేస్తుంది. ఈ పాట సారాంశం పవన్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ జీవితంలో సానుకూలత, ధర్మాన్ని స్వీకరించడాన్ని తెలియజేస్తుందన్నారు. ఇక ఈ పాట ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తుందన్నారు.
Pawan Kalyan : పవన్ డబుల్ ధమాకా.. ఫ్యాన్స్‌కు పండగే..
అదేవిధంగా.. నటుడిగా ఎన్టీఆర్ యొక్క గొప్ప ప్రదర్శనలు పౌరాణిక, జానపద సినిమాల నుంచి వచ్చాయి. రాముడు, కృష్ణుడు పాత్రలలో ఆయన ఒదిగిపోయిన తీరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ తన శక్తిని, ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిగా అద్భుతంగా చిత్రీకరించబడ్డారు. ఈ అంశం నుండి ప్రేరణ పొంది.. ‘హరి హర వీరమల్లు’లో పవన్ కోసం విల్లు, బాణాన్ని రూపొందించాము. పవన్ కళ్యాణ్ యొక్క శక్తిని సూచించడానికి, న్యాయం కోసం పోరాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకగా ఈ ఆయుధాలు రూపొందించబడ్డాయి అని జ్యోతి కృష్ణ తెలిపారు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోండగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను ఇచ్చింది.