Pawan Kalyan : ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా.. ఫ్యాన్స్‌కు పండ‌గే..

జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది హరిహర వీరమల్లు మూవీ.

Pawan Kalyan : ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా.. ఫ్యాన్స్‌కు పండ‌గే..

Pawan Kalyan DOUBLE DHAMAKA OG Teaser

Updated On : July 15, 2025 / 8:51 AM IST

జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది హరిహర వీరమల్లు మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ చాలా గ్యాప్‌ తర్వాత వెండితెరమీద కనిపిస్తున్న సినిమా ఇది. ఈ పిక్చర్‌పై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. ఫ్యాన్స్ అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా సిద్ధమవుతోందట.

హరిహర వీరమల్లు రిలీజ్ రోజే థియేటర్లలో OG టీజర్ కూడా ప్లే కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. రెండు భారీ చిత్రాల విజువల్ ట్రీట్ ఒకేసారి చూడబోతున్నామన్న ఉత్సాహం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.

K-ramp : ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘కె-ర్యాంప్’ గ్లింప్స్‌..

OG సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్‌గా నడుస్తోందట. DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌ మూవీపై.. పవన్ లుక్..ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయ్.

ఓజీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు రిలీజ్‌తో కలిసి వస్తే మాత్రం థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. ఇక హరిహర వీరమల్లు కూడా చారిత్రక బ్యాక్‌డ్రాప్‌తో భారీ స్కేల్‌లో తెరకెక్కుతోంది. పవన్ రెండు వైవిధ్యమైన రోల్స్‌లో కనిపించనుండటంతో, అభిమానులు ఈ విజువల్ వండర్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఒకే రోజు రెండు సినిమాల సందడి, అది కూడా పవర్ స్టార్ మార్క్ యాక్షన్, ఎమోషన్‌తో, ఫ్యాన్స్‌కు పండగలా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారిక అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.