Subhashree-Priyanka Kain
Bigg Boss 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఐదో వారం పూర్తి కావొస్తుంది. నాలుగు వారాల్లో నలుగురు మహిళా కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఐదో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం నామినేషన్లలో తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ లు ఉన్నారు. కాగా.. ఈ సారి కూడా మహిళా కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేయనున్నారట.
ఓటింగ్‌లో శివాజీ టాప్ ఉన్నాడని తెలుస్తోంది. శుభశ్రీ కి అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయని టాక్. దీంతో ఆమెనే ఎలిమినేట్ అయ్యిందని అటున్నారు. గత వారం టేస్టీ తేజ ఎలిమినేషన్‌కు దగ్గరగా వచ్చాడు. రతిక ఎలిమినేట్ కావడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఈ వారం అతడు బాగా ఎంటర్‌టైన్ చేయడంతో ఓటింగ్ పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో అతడు సేమ్ అయ్యాడట. కాగా.. ఇప్పటికే నాలుగు వారాల్లో నలుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి.
Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ వీడియో చూశారా..? లీక్ చేసిన మెగా స్టార్
కొత్త కంటెస్టెంట్ల ఎంట్రీ..!
ఇదిలా ఉంటే ఆదివారం సర్‌ప్రైజ్ ఉంటుందని ఇప్పటికే నాగార్జున చెప్పాడు. ఆ సర్‌ప్రైజ్ ఏంటంటే ఆదివారం ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెడుతున్నారట. వాళ్లు ఎవరో కాదని.. కెవ్వు కార్తీక్, అశ్విని శ్రీ, పూజామూర్తి, నయని పావని, అర్జున్ అంబటి, భోళే షావలే అంటున్నారు. మరీ వీటిలో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.