W/O Anirvesh : W/O అనిర్వేష్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. పోస్టర్ రిలీజ్..
తాజాగా W/O అనిర్వేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ రిలీజ్ చేసారు.

Jabaradsth Ram Prasad W/O Anirvesh First Look Released
W/O Anirvesh : జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, ఆటో రామ్ ప్రసాద్, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న W/O అనిర్వేష్. గజేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాణంలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Also Read : Dance Ikon 2 : ఆహా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో వచ్చేసింది.. మెంటార్స్ ఎవరో తెలుసా?
తాజాగా W/O అనిర్వేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన W/O అనిర్వేష్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని అన్నారు.
సినిమా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లింక్డ్ స్క్రీన్ ప్లే అనే ఫిలిం టెక్నిక్ తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్ ని ట్రై చేసాడు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంలో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాము.