Jabardasth Abhi New Horror Movie The Devils Chair Poster Released
The Devils Chair : హారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి స్పందనే వస్తుంది. త్వరలో మరో హారర్ సినిమా రాబోతుంది. జబర్దస్త్ తో మంచి గుర్త్తింపు తెచ్చుకున్న నటుడు అభి ప్రస్తుతం మళ్ళీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో అభి హారర్ సినిమాతో రాబోతున్నాడు. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సిఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కెకె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి నిర్మాణంలో గంగ సప్త శిఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ సినిమా ‘ది డెవిల్స్ చైర్’. ఈ సినిమాలో జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also See : రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా.. ‘చావా’ ట్రైలర్ చూశారా?
తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. సరైన హారర్ సినిమా వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ సినిమాలు నచ్చేవాళ్లకు మా ది డెవిల్స్ చైర్ పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త కథతో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే సినిమాని తీస్తున్నాం అని తెలిపారు.
ఈ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ.. మా ది డెవిల్స్ చైర్ సినిమాలో ఏఐ టెక్నాలజీ వాడి సరికొత్త కథతో నిర్మిస్తున్నాము. షూటింగ్ అంతా పూర్తి అయింది. మా సినిమాని 2025 ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ చేస్తామని తెలిపారు.