Venu Swamy – Allu Arjun : వేణుస్వామి మరో బాంబ్.. ఐటీ రైడ్స్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా.. ఆయన మాటల్లోనే..
తాజాగా వేణుస్వామి మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ జాతకాల గురించి చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు.

Astrologist Venuswamy Comments on Allu Arjun and Sukumar Video goes Viral
Venu Swamy – Allu Arjun : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో నాగచైతన్య – సమంత జాతకాల నుంచి ఇటీవల అల్లు అర్జున్ జాతకం వరకు ఎవరో ఒకరిపై మాట్లాడుతూ వార్తల్లో, వివాదాల్లో నిలుస్తారు. ఇటీవల శోభిత విషయంలో వేణుస్వామి మాట్లాడింది సీరియస్ అయి మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. ఎన్ని వివాదాలు అయినా వేణుస్వామి మాత్రం సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానట్లేదు.
తాజాగా వేణుస్వామి మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ జాతకాల గురించి చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ ఓ పక్కన పుష్ప 2 సినిమాతో రికార్డులు సెట్ చేస్తున్నా మరో పక్క వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే ముందుంది అసలు సంగతి అంటూ వేణుస్వామి మాట్లాడారు.
Also See : Samantha : తన టీమ్‌తో కలిసి పికెల్ బాల్ ఆడిన సమంత.. ఫొటోలు చూశారా?
వేణుస్వామి తన వీడియోలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గురించి, ఆయన చుట్టూ జరిగే వాటి గురించి అందరూ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ కు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. అల్లు అర్జున్ ది కన్యారాశి, సుకుమార్ గారిది కుంభ రాశి. వీళ్ళ జాతకాలు షష్టాష్టకం కాంబినేషన్. వీళ్ళ జాతకంలో శని స్థానం బట్టి సంఘటనలు జరుగుతాయి. ఈ రెండు కలవడం వల్ల ఒక ఫైర్ లాగా బ్లాస్ట్ అవుతుంది, దీని వల్ల చుట్టుపక్కన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఇప్పుడు ఉన్న శని స్థానం ప్రకారం ఆయనకు శత్రు స్థానం, రోగ స్థానం ఉన్నాయి. గత సంవత్సరం నుంచి అల్లు అర్జున్ మీద విపరీతమైన శత్రువుల దాడి జరుగుతుంది. వీటివల్ల, జైలుకు వెళ్లడం వల్ల మానసికంగా బాగా దెబ్బ తిన్నారు. వీటితో పాటు ఓ సంచలనం సృష్టిస్తారు. అదే పుష్ప 2 సినిమా. 2025 మార్చ్ 30 వరకు అల్లు అర్జున్, సుకుమార్ లకు శని కీలక స్థానాల్లో ఉండటం వల్ల పెను సంచలనాలు, సమస్యలు వస్తాయి. వీళ్ళ వల్ల మైత్రి మూవీస్ వాళ్ళు, దేవిశ్రీ ప్రసాద్ ఎఫెక్ట్ అయ్యారు. మార్చ్ 30 తర్వాత ఇంకా పైకి ఎదుగుతారు అని చెప్పారు.
Also Read : Paradha Teaser : అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ టీజర్ వచ్చేసింది..
అలాగే.. ఉగాది నుంచి శని తులారాశిలోకి వెళ్లడం వల్ల తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు రాజకీయాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు సినిమా టైటిల్స్, ట్రైలర్ మాత్రమే పడ్డాయి. అసలైన సినిమా ముందుంది. ఇలాంటివి మార్చ్ 30 నుంచి మరిన్ని చూడబోతున్నాము అని అన్నారు. వేణుస్వామి చెప్పిన అసలు సినిమా ఏంటో చూడాలంటే మార్చ్ 30 దాకా ఎదురుచూడాలి. మరి వేణుస్వామి కామెంట్స్ మీద బన్నీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
View this post on Instagram