Paradha Teaser : అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ టీజర్ వచ్చేసింది..

తాజాగా నేడు పరదా సినిమా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ టీజర్ చూసేయండి..

Paradha Teaser : అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ టీజర్ వచ్చేసింది..

Anupama Parameswaran Darshana Rajendran Paradha Movie Teaser Released

Updated On : January 22, 2025 / 5:34 PM IST

Paradha Teaser : అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఇటీవల పరదా అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్, మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయిపోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.

Also Read : IT Raids : సుకుమార్ మీద కూడా.. ఆ లెక్కన.. ఆ స్టార్ హీరోలపై కూడా ఐటీ దాడులు చేస్తారా?

గతంలో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు పరదా సినిమా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ టీజర్ చూసేయండి..

ఈ టీజర్ చూస్తుంటే ఓ గ్రామంలో అమ్మాయిలు చున్నీతో ఫేస్ కవర్ చేసుకుంటారని, ఆ ఉరి నుంచి సుబ్బు అనే అమ్మాయి(అనుపమ) బయటకి రావడం, ఇంకో ఇద్దరు మహిళలను కలవడం, వారితో ట్రావెలింగ్, అంతలో ఊర్లో కట్టుబాట్లు, ఊరి సమస్య, మళ్ళీ ఊరికి తిరిగి వెళ్తుందా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని తెలుగు, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు.

Also See : Samantha : తన టీమ్‌తో కలిసి పికెల్ బాల్ ఆడిన సమంత.. ఫొటోలు చూశారా?