IT Raids : సుకుమార్ మీద కూడా.. ఆ లెక్కన.. ఆ స్టార్ హీరోలపై కూడా ఐటీ దాడులు చేస్తారా?
పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్, మైత్రి సీఈఓ చెర్రీ ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు చేసారు.

After Dil Raju Mythri Producers IT Raids on Allu Arjun Ram Charan Rumours Goes Viral
IT Raids : నిన్న ఉదయం నుంచి టాలీవుడ్ లో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఇల్లు, ఆఫీసులపై దాడులు చేసి అన్ని లెక్కలు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు భార్యను బ్యాంకుకు కూడా తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు. అలాగే పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్, మైత్రి సీఈఓ చెర్రీ ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు చేసారు.
అంతటితో ఆగకుండా మరింతమంది నిర్మాతలు, సినీ ప్రముఖుల ఇల్లు, ఆఫీసులలో దాడులు చేసారు. ఆ దాడులు నేడు కూడా కొనసాగుతుండటంతో టాలీవుడ్ షాక్ కి గురయింది. నేడు సుకుమార్ ఎక్కడికో వెళ్తుండగా ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి తీసుకొచ్చి మరీ ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్, ఆదాయ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆయన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.
Also Read : Razakar : రజాకార్ సినిమాపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాలలో వాటా తీసుకున్నట్టు సమాచారం. ఇందుకే సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ వాళ్ళు సోదాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మరో కొత్త సందేహం నెలకొంది. ఈ లెక్కన చూసుకుంటే అల్లు అర్జున్ కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకున్నాడు కాబట్టి, బన్నీ పుష్ప 2 సినిమాకు 300 కోట్ల వరకు అందుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి కాబట్టి అల్లు అర్జున్ ఇంటిపై కూడా ఐటీ దాడులు చేస్తారా అనే సందేహం కలుగుతుంది.
సంక్రాంతికి వచ్చిన సినిమాలకు, పుష్ప 2 సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చినట్టు పోస్టర్స్ వేయడం వల్లే ఐటీ దాడులు జరుగుతున్నాయి అని పలువురు వాదన. ఈ లెక్కన సంక్రాంతి హీరోలపై కూడా ఐటీ దాడులు చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. రామ్ చరణ్, వెంకీమామ ఇంట్లో కూడా సోదాలు చేస్తారా? కేవలం నిర్మాతలు, ఫైనాన్షియర్లే అయితే సుకుమార్ మీద ఎందుకు ఐటీ దాడులు చేస్తారు, అనిల్ రావిపూడి ఆఫీస్ మీద కూడా ఐటీ దాడులు చేసారని సమాచారం. దీంతో అల్లు అర్జున్, చరణ్, వెంకీమామ.. ఇలా పలువురు హీరోలపై కూడా ఐటీ దాడులు చేస్తారని టాలీవుడ్ లో వినిపిస్తుంది.
Also Read : SS Thaman : అలా సంపాదించిన డబ్బులన్నీ ఛారిటీకే.. ఈ విషయంలో తమన్ ని మెచ్చుకోవలసిందే..
గతంలో కూడా సినీ ప్రముఖులు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు రెండో రోజ్ కూడా ఐటీ దాడులు కొనసాగడంతో టాలీవుడ్ లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. తాజాగా నేడు దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఐటీ రైడ్స్ పై స్పందించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. నా ఒక్కడి పైనే రైడ్స్ కావట్లేదు, ఇండస్ట్రీ మొత్తం మీద రైడ్స్ అవుతున్నాయి అని తెలిపారు. దీంతో టాలీవుడ్ లోని మిగిలిన ప్రముఖులు కూడా తమపై ఐటీ దాడులు జరుగుతాయేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.