SS Thaman : అలా సంపాదించిన డబ్బులన్నీ ఛారిటీకే.. ఈ విషయంలో తమన్ ని మెచ్చుకోవలసిందే..
తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న తమన్ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Music Director Thaman Reveals Interesting Fact about his Charity
SS Thaman : ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటలు తమిళ్, హిందీ సినిమాలకు కూడా మ్యూజిక్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా సినిమాలకు మ్యూజిక్ మాత్రమే కాక క్రికెట్, టీవీ షోలు, ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంటాడు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న తమన్ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించగా నారా భువనేశ్వరి, తమన్ తో పాటు పలువురు ఎన్టీఆర్ ట్రస్ట్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ మ్యూజికల్ ఫెస్ట్ కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కూడా హాజరవుతున్నట్టు తెలిపారు.
Also Read : Director Sukumar : దర్శకుడు సుకుమార్‌కు ఐటీ అధికారుల షాక్.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఇంటికే..
ఈ ప్రెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ.. నేను క్రికెట్ లో సంపాదించే డబ్బు, నా టీవీ షోలు, నా కాన్సర్ట్స్.. ఇలా నేను సినిమాలు కాకుండా బయట చేసే వాటి నుంచి సంపాదించే డబ్బు అంతా చారిటీలకు ఇచ్చేస్తాను. ఏదో ఒక ట్రస్ట్ కి, అనాథాశ్రమంకు, ఓల్డేజ్ హోమ్స్ కి ఇచ్చేస్తాను. కేవలం సినిమాల్లో సంపాదించే డబ్బులు మాత్రమే నేను ఇంటికి తీసుకెళ్తాను, నా కోసం వాడుకుంటాను. మిగిలింది ఎంత సంపాదించినా సమాజానికి ఇచ్చేస్తాను. గత 15 ఏళ్లుగా నేను ఇదే చేస్తున్నాను. సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. దేవుడు మనకు కావాల్సినంత ఇచ్చాడు. ఇంకా ఎక్కువ వస్తే సమాజంలో బతకడానికి కష్టపడే వాళ్లకు ఇవ్వాలి. అందుకే నేను ఇచ్చేస్తాను. ఈ షో ద్వారా కూడా నాకు వచ్చే డబ్బులు ఛారిటీకే ఇచ్చేస్తాను. ఈ షోలో నా టీమ్ కి వచ్చే డబ్బుల్లో కూడా కొంత ఛారిటీకే ఇస్తాము అని తెలిపాడు.
Also Read : RC 16 : రామ్‌చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా నయా సెన్సెషన్..!
దీంతో పలువురు తమన్ ని ఈ విషయంలో అభినందిస్తున్నారు. ఈ విషయంలో తమన్ ని మెచ్చుకోవలసిందే అంటున్నారు. తమన్ ఇటీవలే సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాల్లోని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం తమన్ చేతిలో దాదాపు ఓ పది సినిమాలు ఉన్నట్టు సమాచారం.