RC 16 : రామ్‌చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా నయా సెన్సెషన్..!
కుంభామేళా పుణ్యమా అని ట్రెండింగ్‌లోకి వచ్చిన మోనాలిసా భోంస్లే.. ఇప్పుడు ఓ సినిమా చాన్స్ కొట్టేసిందట. అదీ కూడా మన తెలుగు హీరోతో మూవీ చేయబోతుందట.

ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో చూసినా ఆమె ట్రెండింగ్. మోనాలిసా అని పేరు ఎందుకు పెట్టారో కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోంస్లే మాత్రం అందమంటే ఇలాగే ఉంటుందా అన్నంతగా ఆకట్టుకుంటోంది. మహా కుంభమేళాలో రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకుంటూ..సోషల్ మీడియాకు రీల్స్‌కు చిక్కిన ఈ మోనాలిసా భోంస్లే.. ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ది కంట్రీగా మారిపోయింది.
నేషనల్ మీడియా క్యూలు కట్టి మరి మోనాలిసాతో ఇంటర్యూలు చేస్తుంది. కుంభామేళా పుణ్యమా అని ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ యువతి.. ఇప్పుడు ఓ సినిమా చాన్స్ కొట్టేసిందట. అదీ కూడా మన తెలుగు హీరోతో మూవీ చేయబోతుందట.
Priyanka Chopra : చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త అధ్యాయం అంటూ పోస్టు..!
రామ్‌చరణ్‌తో కలిసి నటించబోతుందట మోనాలిసా భోంస్లే. బుచ్చిబాబు డైరెక్షన్‌లో చెర్రీ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న RC16 సినిమాలో మోనాలిసాను తీసుకుంటున్నట్లు టాక్. జాన్వీకపూర్‌ను ఇప్పటికే హీరోయిన్ ఫిక్స్ చేశారు. దీంతో మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనన్న ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా మోనాలిసా అందానికి యూత్ పుల్ ఫిదా అవుతుండటంతో.. RC16లో ఆ యువతికి మంచి రోల్ పడితే మాత్రం..చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాగా కలిసి వస్తుందంటున్నారు ఫ్యాన్స్.
గేమ్‌ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. RC16 కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మోనాలిసాను కనుక చెర్రీ సినిమాలోకి తీసుకుంటే మాత్రం..బ్లాక్ బస్టర్ హిట్‌ను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. జనవరి 27 నుంచి RC 16 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. జూలైలోపు షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితిల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
Kannappa : తెలుగులో కన్నప్ప ప్రమోషన్స్ లేవా? ప్రెస్ మీట్స్ పెట్టరా? ఎందుకంటే?