Kannappa : తెలుగులో కన్నప్ప ప్రమోషన్స్ లేవా? ప్రెస్ మీట్స్ పెట్టరా? ఎందుకంటే?
ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఆల్రెడీ బెంగళూరు, చెన్నైలో ప్రెస్ మీట్స్ నిర్వహించారు.

No Press Meets and Heavy Promotions in Telugu States for Manchu Vishnu Kannappa Movie
Kannappa : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టు అని భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి అందులో నటిస్తున్న పలువురి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఆల్రెడీ బెంగళూరు, చెన్నైలో ప్రెస్ మీట్స్ నిర్వహించారు. అక్కడి మీడియాతో మాట్లాడారు.
కానీ తెలుగులో మాత్రం కన్నప్ప ప్రెస్ మీట్స్ పెట్టరని సమాచారం. ప్రెస్ మీట్స్ పెడితే మీడియాతో మాట్లాడాలి, మీడియా అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అని గొడవ జరుగుతుంది. ఇలాంటి టైంలో తెలుగులో ప్రెస్ మీట్స్ పెడితే ముందు సినిమా గురించి కాకుండా మనోజ్ ఇష్యూ గురించి అడుగుతారనే ఉద్దేశంతోనే ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టరని విష్ణు సన్నిహితులు అంటున్నారు.
Also Read : Sukumar : దిల్ రాజు కోసం వస్తున్న సుకుమార్.. ఆ సినిమాకు హెల్ప్ చేయడానికి..
కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా కేవలం ఏపీ, హైదరాబాద్ లో రెండు ఈవెంట్స్ మాత్రం పెడతారని తెలుస్తుంది. మిగిలినదంతా డిజిటల్ ప్రమోషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలతోనే ప్రమోట్ చేయనున్నారు అని సమాచారం. అయితే భారీ బడ్జెట్ తో, చాలా మంది స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాకు ప్రమోషన్స్ చేయకపోతే ఎలా? అందులోను మెయిన్ తెలుగులో ప్రమోట్ చేయకపోతే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు అయితే తెలుగులో ఒక్క ప్రెస్ మీట్, ఈవెంట్ ఏమి నిర్వహించలేదు. ఇప్పటికే చెన్నై, బెంగళూరులో ప్రమోషన్స్ చేయగా త్వరలో కేరళ, ముంబైలో ప్రెస్ మీట్స్ పెట్టనున్నారు.
Also Read : Sankranthiki Vasthunnam : దిల్ రాజుపై ఐటీ దాడులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఈవెంట్ ఉంటుందా?
ఇక ఈ కన్నప్ప సినిమాని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ న్యూజిలాండ్ అడవుల్లోనే చేశారు. కొంత భాగం రామోజీ ఫిలిం స్టూడియోలో సెట్ వేసి చేశారు. ఈ సినిమాకు దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారని వినిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా.