Sukumar : దిల్ రాజు కోసం వస్తున్న సుకుమార్.. ఆ సినిమాకు హెల్ప్ చేయడానికి..
మొన్నటివరకు పుష్ప 2తో సుకుమార్ పుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుక్కు ఫ్రీ అవటంతో

Sukumar Helping to Dil Raju son Ashish Reddy Movie
Sukumar : డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ తో కూడా పలు సినిమాలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో సుకుమార్ స్క్రిప్ట్, మేకింగ్ స్టైల్‌తో లోబడ్జెట్ మూవీ తీస్తున్నారు. గతంలో కొంత షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన ‘సెల్ఫిష్’ సినిమా మళ్లీ పట్టాలు ఎక్కబోతుందట. దిల్‌రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా, హీరోయిన్ ఇవానా జంటగా గతంలో సెల్ఫిష్ అనే సినిమాని ప్రకటించారు.
సెల్ఫిష్ సినిమా నుంచి ఓ పాట కూడా రిలీజ్ చేశారు. సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తోంది. అయితే పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్‌కు మధ్యలో బ్రేక్ ఇచ్చారు. క్వాలిటీ ఔట్‌పుట్‌తో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే స్క్రిప్ట్‌లో కొన్ని చేంజేస్ చేయడంతో పాటు మేకింగ్ స్టైల్ కూడా మార్చాలని ఫిక్స్ అయ్యారట. అందుకోసం సుకుమార్ హెల్ప్ తీసుకుంటున్నారట.
Also Read : Saif Ali Khan : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు అంటే..?
మొన్నటివరకు పుష్ప 2తో సుకుమార్ పుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుక్కు ఫ్రీ అవటంతో సెల్ఫిష్ మూవీ మళ్ళీ సెట్స్ మీదకు వెళ్తుందని, సుకుమార్ దగ్గర ఉండి మరీ సినిమా స్క్రిప్ట్‌ను, మేకింగ్ స్టైల్‌ను ఛేంజ్ చేస్తున్నాడంటున్నారు. సెల్ఫిష్ సినిమా పాతబస్తీ నేపథ్యంలో కొనసాగే ఓ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ పర్వాలేదనిపించింది. ఇప్పుడు సుకుమార్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఈ సినిమా త్వరగానే పూర్తవుతుందని భావిస్తున్నారు.
దిల్ రాజు సోదరుడు శిరీష్ హీరోగా గతంలో వచ్చిన రౌడీ బాయ్స్, లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఆశిష్ చేతిలో ప్రస్తుతం సెల్ఫిష్ తో పాటు మరో సినిమా ఉంది. మరి ఆశిష్ మళ్ళీ ప్రేక్షకుల ముందు ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి. ఇక సుకుమార్ పుష్ప 2 భారీ విజయం సాధించి 1850 కోట్ల కలెక్షన్ తో బాహుబలి 2 రికార్డ్ కూడా బద్దలు కొట్టారు. త్వరలో రామ చరణ్ తో తీయబోయే RC17 సినిమా పనులు మొదలుపెడతారని సమాచారం.