Director Sukumar : దర్శకుడు సుకుమార్‌కు ఐటీ అధికారుల షాక్.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఇంటికే..
టాలీవుడ్‌లో మంగళవారం ఉదయం నుంచి ఐడీ దాడులు కలకలం రేపుతున్నాయి.

IT Raids in Director Sukumar House
టాలీవుడ్‌లో మంగళవారం ఉదయం నుంచి ఐడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థల ఆఫీసులు, నిర్మాతల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టారు. ఇప్పటి వరకు నిర్మాతలు, ఫైనాన్షియర్లపై మాత్రమే ఐటీ దాడులు జరుగగా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి.
డైరెక్టర్ సుకుమార్‌ను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఇంటికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్, ఆదాయ వివరాలపై ఆరాతీస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.
దిల్ రాజు నివాసంలోనూ కొనసాగుతున్న సోదాలు..
మరో వైపు ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో రెండో రోజూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఐటీ దాడులు చేస్తున్న ఈ నిర్మాతల చిత్రాలు ఇటీవల బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. మైత్రీ మూవీస్ నిర్మించిన పుష్ప 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
RC 16 : రామ్‌చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా నయా సెన్సెషన్..!