సైఫ్ కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. రూ.15,000 కోట్ల ఆస్తులు గోవిందా..? మొత్తం గవర్నమెంట్ పరం అయిపోతుందా?
సైఫ్ కుటుంబానికి ఓ భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.

Government may take control of Pataudi family Rs 15000 crore property in Bhopal
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లో దాడికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కాస్త కోలుకోవడంతో ఇటీవలే ఆయన ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు. తాజాగా సైఫ్ కుటుంబానికి ఓ భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయన కుటుంబానికి చెందిన రూ.15వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి (సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు) వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉండగా.. ఆ ఆస్తుల సంబంధించిన పలు వివాదాలు కోర్టుల్లో నడుస్తున్నాయి. 2015లో వీటిపై విధించిన స్టేను తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది.
దీంతో ఐకానిక్ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్-ఉస్-సబా ప్యాలెస్, దార్-ఉస్-సలాం, బంగ్లా ఆఫ్ హబీబీ, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ప్రాపర్టీలు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. పటౌడీ వంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ తన బాల్యాన్ని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ లో గడిపారు.
RC 16 : రామ్‌చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా నయా సెన్సెషన్..!
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 2011లో మరణించారు. ఆయన మరణించిన తరువాత ఆయన కుమారుడు సైఫ్ అలీఖాన్ కి భోపాల్ నవాబ్ బిరుదు లభించింది. తలపాగా ఉత్సవం కూడా నిర్వహించారు. ఇప్పుడు పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు.
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అంతే ఏమిటి?
1968లో ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్నీ రూపొందించారు. దేశ విభజన తరువాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వ్యక్తులు.. భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది.
వివాదం ఏంటంటే..?
భోపాల్ చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్ కు ముగ్గురు కుమార్తైలు ఉన్నారు. ఆయన పెద్ద కూతురు అబిదా చట్టబద్ధ వారసురాలు. అయితే.. ఆమె 1950లో పాక్‌కు వెళ్లిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ కింద ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. అయితే.. నవాబ్ రెండో కూతురు సాజిదా సుల్తాన్ వారసులు సైఫ్ అలీఖాన్, షర్మిలా ఠాగూరు వంటి ఈ ఆస్తిపై హక్కు ఉందని 2015లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. తాజాగా ఈ స్టేను ఎత్తివేశారు.
Kannappa : తెలుగులో కన్నప్ప ప్రమోషన్స్ లేవా? ప్రెస్ మీట్స్ పెట్టరా? ఎందుకంటే?
ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయితే.. నిర్దేశించిన గడువు లోగా పటౌడీ కుటుంబం తమ వాదనలను వినిపించలేదు. కాగా.. కోర్టు ఇచ్చిన సమయం ముగిసిపోయింది. దీంతో తరువాత ఏం జరుగుందా అనే ఉత్కంఠ నెలకొంది.
కాగా.. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్‌లో ఈ ఉత్తర్వులను సవాలు చేయడమే పటౌడీ కుటుంబం ముందు ఉన్న ఏకైక అవకాశంగా తెలుస్తోంది.