Avinash : అవినాష్ కు డాక్టర్ చెకప్.. హెల్త్ సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తున్న అవినాష్..?

అవినాష్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం కూడా చూపించారు ప్రోమోలో.

Avinash : అవినాష్ కు డాక్టర్ చెకప్.. హెల్త్ సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తున్న అవినాష్..?

Jabardasth Avinash Evicted from Bigg Boss House with Health Issues Promo goes Viral

Updated On : October 28, 2024 / 1:40 PM IST

Avinash : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎనిమిది వారాలు పూర్తిచేసుకుంది. నిన్న మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇవాళ అవినాష్ బయటకు వచ్చేస్తున్నాడని సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా అవినాష్ కి కడుపు నొప్పితో పాటు ఏదో సమస్యతో బాధపడుతున్నట్టు, డాక్టర్స్ వచ్చి చెక్ చేసారని, చికిత్స చేయించుకోవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.

అవినాష్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం కూడా చూపించారు ప్రోమోలో. అవినాష్ వెళ్లిపోయేటప్పుడు కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. మొదట అవినాష్ ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నారు కానీ డోర్స్ తీసి వెళ్లిపోవడంతో అందరూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు కూడా.

Also Read : Roll Rida : ఆహా.. ముగ్గురు బిగ్ బాస్ భామలతో రోల్ రైడా స్పెషల్ ఫోటో..

ఇటీవల నాగ మణికంఠ కూడా ఆరోగ్య సమస్యలతోనే బిగ్ బాస్ ని అడిగి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అవినాష్ కూడా ఆరోగ్య సమస్యలతోనే బయటకు వస్తున్నారు తెలుస్తుంది. మరి ఇది నిజమేనా లేక కాసేపు హౌస్ మేట్స్ ని ఆట పట్టించడాయికి బిగ్ బాస్ వేసిన ప్లానా తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.