Roll Rida : ఆహా.. ముగ్గురు బిగ్ బాస్ భామలతో రోల్ రైడా స్పెషల్ ఫోటో..
తాజాగా రోల్ రైడా ముగ్గురు భామలతో ఉన్న ఫోటో భానుశ్రీ పోస్ట్ చేయడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ

Roll Rida Special Photo with Ariyana Glory Bhanu Sri Subhashree goes Viral
Roll Rida : ర్యాప్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్న రోల్ రైడా బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొని ప్రస్తుతం సింగర్ గా, ర్యాపర్ గా దూసుకుపోతున్నాడు. ఇటీవల రోల్ రైడా కాకినాడ కాజా అనే హట్కే ర్యాప్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సాంగ్ మంచి హిట్ అయింది. ఈ సాంగ్ లో రోల్ రైడా, శుభశ్రీ కలిసి నటించారు.
తాజాగా రోల్ రైడా ముగ్గురు భామలతో ఉన్న ఫోటో భానుశ్రీ పోస్ట్ చేయడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రోల్ రైడాతో పాటు అరియనా గ్లోరీ, భానుశ్రీ, శుభశ్రీ ముగ్గురు భామలు ఉన్నారు. ఈ ముగ్గురు భామలు బిగ్ బాస్ తో పాపులర్ అయి ఇప్పుడు సీరియల్స్, షోలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. రోల్ రైడా బిగ్ బాస్ సీజన్ 2లో, అరియనా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4లో, భానుశ్రీ – బిగ్ బాస్ సీజన్ 2లో, శుభశ్రీ రాయగురు – బిగ్ బాస్ 7లో పాల్గొన్నారు.

ఇలా బిగ్ బాస్ ముగ్గురు భామలతో కలిసి రోల్ రైడా ఫోటో షేర్ చేయడంతో ఇది కూడా తన కాకినాడ కాజా సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా తీసుకుందేమో అని అభిప్రాయపడుతున్నారు.