Bullet Bhaskar : 5 కోట్ల సినిమా చేసి 100 కోట్లు కొడతా.. నా కథల్ని తీసుకొని వాళ్ళు సినిమాలు చేసుకున్నారు.. డైరెక్టర్ గా బులెట్ భాస్కర్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ డైరెక్టర్ అవుతానని చెప్పుకొచ్చాడు.

Jabardasth Bullet Bhaskar Wants to Become a Movie Director

Bullet Bhaskar : జబర్దస్త్ లో తన కామెడీ స్కిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బులెట్ భాస్కర్ అప్పుడపుడు సినిమాల్లో కనిపిస్తాడు. ఎక్కువగా టీవీ షోలు, బయట ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ డైరెక్టర్ అవుతానని చెప్పుకొచ్చాడు.

బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. జబర్దస్త్ లో నా స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను. నా టీమ్ ని నేనే డైరెక్ట్ చేస్తాను. ఆర్టిస్టులని మౌల్డ్ చేసుకుంటాను. నేను మంచి డైరెక్టర్ అని నా ఫీలింగ్. నేను డైరెక్టర్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాను. మూడు నుంచి 5 కోట్లలో ఒక మంచి సినిమా తీస్తా. దానికి 100 కోట్ల కలెక్షన్స్ తెప్పించడం నా టార్గెట్. హీరో ఎవరైనా నేను 5 కోట్లలోపే సినిమా చేయాలి అనుకుంటున్నాను. కొంతమంది నిర్మాతలకు నా కథలు చెప్పాను. కానీ వాళ్ళు నా కథల్ని కాపీ కొట్టి వేరే వాళ్ళతో సినిమాలు తీసేసారు. నా కథల్లో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాలు తీసుకున్నారు.

Also Read : SSMB 29 : ఇదేంటి బ్రో.. రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు సమ్మర్ హాలిడేస్ అంట.. మళ్ళీ షూటింగ్ ఎప్పుడంటే..?

అందులో రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయి కూడా. అప్పుడు డిసైడ్ అయ్యాను ఎవడికి పడితే వాడికి కథలు చెప్పొద్దు అని. సిన్సియర్ నిర్మాతలకు కథలు చెప్పాలి అనుకుంటున్నాను. కాకపోతే మనం కొత్తగా ఆలోచించినంత కాలం మనకు ఢోకా లేదు. డైరెక్టర్ గా వెళ్ళినా నేను జబర్దస్త్ వదలను. జబర్దస్త్ ఉన్నంత కాలం చేస్తూనే ఉంటాను అని తెలిపారు.

ఇప్పటికే జబర్దస్త్ నుంచి వేణు, ధనరాజ్ డైరెక్టర్స్ గా మారి మంచి సినిమాలు ఇచ్చారు. త్వరలో కిరాక్ ఆర్పీ డైరెక్టర్ గా మారబోతున్నాడు. మరి బుల్లెట్ భాస్కర్ ఎప్పుడు డైరెక్టర్ గా మారతాడో, ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.

Also Read : Bullet Bhaskar : వామ్మో.. బుల్లెట్ భాస్కర్ దగ్గర అన్ని వందల వాచ్ లు ఉన్నాయా? ఖరీదైన వాచ్ లు పెట్టుకున్నందుకు తిట్టారంట..